జూన్ 28న ‘బ్రోచేవారెవ‌రురా’ | Sree Vishnu and Nivetha Thomas Brochevarevarura Release On June 28th | Sakshi
Sakshi News home page

జూన్ 28న ‘బ్రోచేవారెవ‌రురా’

Published Tue, Jun 11 2019 12:02 PM | Last Updated on Tue, Jun 11 2019 12:02 PM

Sree Vishnu and Nivetha Thomas Brochevarevarura Release On June 28th - Sakshi

శ్రీవిష్ణు, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం ‘బ్రోచేవారెవ‌రురా’. ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది. వివేక్ ఆత్రేయ ద‌ర్శక‌త్వం వ‌హించిన చిత్రమిది. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో చిత్రం ఇది. ‘చ‌ల‌న‌మే చిత్రము... చిత్రమే చ‌ల‌న‌ము’ అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. స‌త్యదేవ్‌, నివేదా పేతురాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్రల్లో క‌నిపిస్తారు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ స‌పోర్టింగ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ స్వరాలందించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మ‌న్యం ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై విజ‌య్ కుమార్ మ‌న్యం నిర్మిస్తున్నారు.‘బ్రోచేవారెవ‌రురా’ ట్రైల‌ర్, ఆడియో విడుద‌ల గురించి త్వర‌లోనే నిర్మాత ప్రక‌టించ‌నున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement