
అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో లాంటి వైవిధ్యమైన సినిమాలతో అలరించిన శ్రీ విష్ణు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మెంటల్ మదిలో ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్రోచేవారెవరురా..! అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా నివేదా ధామస్‌తో పాటు నివేదా పేతురాజ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు పెళ్లి చూపులు, సమ్మోహనం లాంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిన వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment