హీరోయిన్లలో యాక్టింగ్ బాగా చేయడం సహజమే. కానీ అంతకు మించిన టాలెంట్స్ కూడా కొందరిలో ఉంటాయి. అవి టైమ్ వచ్చినప్పుడు బయటపడుతుంటాయి. అలా తెలుగు హీరోయిన్ నివేతా పేతురాజ్‌లోని మరో ప్రతిభ ఇప్పుడు బయటపడింది. ఏకంగా కప్ కొట్టేయడంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఈమెలో ఏయేం టాలెంట్స్ ఉన్నాయి? ఏంటి సంగతి?
(ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
తమిళనాడుకు చెందిన నివేతా పేతురాజ్.. 2016లో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదే 'మెంటల్ మదిలో' అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం తదితర సినిమాలు చేసింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత పేరు అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే ఈమె ఏం మూవీస్ చేస్తుందనేది తెలీదు.
నటన-మోడలింగ్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ప్రొఫెషనల్ షట్లర్‌లా మారిపోయింది. మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్‌షిప్ పోటీలోని మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టింది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. అలానే 'తర్వాత ఏంటి?' అనే ఓ క్యాప్షన్ పెట్టింది. అంటే మళ్లీ ఏదో పోటీలో టాలెంట్ చూపించబోతుందనమాట.
(ఇదీ చదవండి: బిజినెస్ మొదలుపెట్టిన నటి సన్నీ లియోన్.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment