నివేదా పేతురాజ్
సినిమా: కరోనా వైరస్‌ను ఇలా నిరోధించవచ్చు అంటోంది నటి నివేదా పేతురాజ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయం పట్టుకుంది. చైనా నుంచి ఈ వ్యాధి అన్ని దేశాలకు వ్యాపిస్తుండడంతో జనం భయకంపితులవుతున్నారు. చైనా నుంచి ఆస్ట్రేలియా, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కరోనా వ్యాధి ప్రకంపనలను సృష్టిస్తోంది. ఇక ఇది ఇప్పటికే ఇండియాకూ సోకిందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. కేరళలో ఒక యువతి కరోనా వ్యాధి బారినపడినట్లు తెలుస్తోంది. దీంతో కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. అందుకోసం ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా ప్రముఖ వైద్యులే కరోనా వ్యాధికి వైద్యం లేదని చెబుతున్న పరిస్థితి.
అలాంటిది నటి నివేదా పేతురాజ్ కరోనా వ్యాధిని నిరోధించడానికి ఒక టిప్‌ను తెలిపింది. ఒక గుర్తింపు పొందిన నటుడు గానీ నటి గానీ ఏ విషయం గురించి అయినా చెప్పారంటే అది సగటు ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. అలానే నటి నివేదా పేతురాజ్ కరోనా వైరస్‌ను ఇలా నిరోధించవచ్చు ఒక చిట్కాను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ పేర్కొంటూ పసుపు, తులసి, అల్లం కలిపిన కషాయాన్ని తాగుతున్న ఫొటోను పోస్ట్ చేసి ఫైట్ కరోనా వైరస్ అనే ట్యాగ్‌ను పొందుపరిచింది. ఈ కషాయంతో కరోనా వ్యాధిని నిరోధించవచ్చునని నటి నివేదా పేర్కొంది. అంతా బాగానే ఉంది కానీ ఈ అమ్మడు చెప్పిన నాటు వైద్యం నిజంగానే కరోనా వైరస్‌ను నిరోధిస్తుందా, ఎలాంటి ఆధారాలతో ఆమె ఈ చిట్కాను చెప్పింది. దీని గురించి మన అలోపతి వైద్యులు ఏమంటారు లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలి.
Comments
Please login to add a commentAdd a comment