
పోలీస్‌గా చార్జ్ తీసుకోవడానికి టైమ్ అయ్యింది హీరో ప్రభుదేవాకు. ఏసీ ముగిల్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో నివేథా పేతురాజ్ కథానాయికగా నటిస్తున్నారు. నేమిచంద్ ఝబాగ్ నిర్మిస్తున్నారు. సురేశ్ మీనన్, మహేందర్ కీలక పాత్రలు చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కెరీర్‌లో తొలిసారి ప్రభుదేవా పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. సో.. పోలీస్‌గా ప్రభుదేవాకు డ్యూటీకి వేళ అయిందన్న మాట. ఇది వరకు ప్రభుదేవా దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందిన ‘పోకిరి, విల్లు’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఏసీ ముగిల్ ఇప్పుడు ప్రభుదేవాను డైరెక్ట్ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment