మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్‌కు ఎంటట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే సినిమాల్లోకి రాకముందు బొటిక్ నిర్వహించేది. అంతేకాకుండా పలు ఈవెంట్లు, కార్ల కంపెనీల్లోనూ పనిచేశానని ఓ సందర్భంలో నివేదా పేర్కొంది.
ఆ టైంలోనే మంచి ఫీచర్స్ ఉన్నాయి..సినిమాల్లో ట్రై చేయమని కొందరు ఫ్రెండ్స్ సూచించగా అలా ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. ఎక్కువ సినిమాలు చేయడం కంటే తన పాత్రకు స్కోప్ ఉంటేనే ఆ ప్రాజెక్టుకు ఓకే చెబుతానని, ఒకవేళ నటిని కాకపోయి ఉంటే యోగా ఇన్ స్ట్రక్టర్ అయ్యేదాన్ని అని తెలిపింది. ఇటీవలె పాగల్ చిత్రంలో నటించిన ఈ అమ్మడు త్వరలోనే విరాటపర్వం సినిమాలో అలరించనుంది.
చదవండి : KGF Chapter2: రిలీజ్ డేట్ ఫిక్స్..ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్
'డైరెక్టర్ కంటే డిజైనర్‌గానే ఎక్కువ సంపాదించా'
Comments
Please login to add a commentAdd a comment