అరుణ్‌ విజయ్‌కు జంటగా.. | Arun Vijay And Nivetha Pethuraj Acting Together | Sakshi
Sakshi News home page

అరుణ్‌ విజయ్‌కు జంటగా..

Published Sat, Apr 27 2019 8:08 AM | Last Updated on Sat, Apr 27 2019 8:08 AM

Arun Vijay And Nivetha Pethuraj Acting Together - Sakshi

తమిళసినిమా: యువ నటుడు అరుణ్‌ విజయ్‌కు జోడీగా నివేదాపేతురాజ్‌ జత కట్టబోతున్నారు. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం చిత్రంతో విజయాన్ని అందుకున్న అరుణ్‌ విజయ్, తడం చిత్రంతో హీరోగా మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నడు. ప్రస్తుతం మూడర్‌ కూట్టం చిత్రం ఫేమ్‌ నవీన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనితో కలిసి అగ్ని సిరగుగల్‌ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు తెలుగులో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న సాహో చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. వీటితో పాటు తాజాగా మరో చిత్రానికి అరుణ్‌ విజయ్‌ పచ్చజెండా ఊపారు. దీనికి యువ దర్శకుడు కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు దృవంగళ్‌ పదునారు చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తరువాత అరవిందస్వామి, శ్రియ నటించిన నరకాసురన్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయినా విడుదలలో జాప్యం జరుగుతోంది.

తాజాగా కార్తీక్‌ నరేన్‌ నటుడు అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నటి నివేదాపేతురాజ్‌ను నాయకిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళం, తెలుగు చిత్రాలతో బిజిగా ఉంది. ఇటీవల తెలుగులో నటించిన చిత్రలహరి మంచి సక్సెస్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బ్రోచేవారెవరురా అనే మరో చిత్రం సైతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తమిళంలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ప్రభుదేవాకు జంటగా పొన్‌ మాణిక్యవేల్, విజయ్‌సేతుపతితో సంఘ తమిళన్, దుల్కర్‌ సల్మాన్‌ సరసన వాన్‌ చిత్రాలతో పాటు విష్ణు విశాల్‌కు జంటగా జగజాల కిల్లాడి చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా అరుణ్‌ విజయ్‌తో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతోంది. లైకా ప్రొడక్షన్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెలువడనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement