ఆయన పేరు చెప్పగానే ఓకే చెప్పేసిందట..! | Nivetha peturaj romance with prabhu deva as soon | Sakshi
Sakshi News home page

ఆయన పేరు చెప్పగానే ఓకే చెప్పేసిందట..!

Published Thu, Oct 26 2017 6:08 PM | Last Updated on Thu, Oct 26 2017 7:32 PM

Nivetha peturaj  romance with prabhu deva as soon

సాక్షి, చెన్నై: నృత్య దర్శకుడిగా దుమ్మురేపిన ప్రభుదేవా ఆ తరువాత దర్శకుడిగా మారిపోయాడు. కోలీవుడ్‌, టాలీవుడ్‌లతోపాటు బాలీవుడ్‌లో కూడా సంచలనం సృష్టించారు. ప్రస్తుతం హీరోగా యమ బిజీ అయిపోయారు. ఆయన ప్రస్తుతం రెండు చిత్రాల నటిస్తున్నారు. మరో రెండు చిత్రాలు కమిట్‌మెంట్‌ దశలో ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. సదూరం-2 చిత్రం దర్శకుడు సుమంత్‌ రాధాకృష్ణన్‌ చిత్రంలో ప్రభుదేవా హీరోగా నటించనున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌ నివేథా పేతురాజ్ నటించే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రం ఒరునాళ్‌ కూత్తులో ఈ బ్యూటీ మంచి పేరు తెచ్చుకుంది.  ఇటీవల నటించిన పొదువాగ ఎన్‌ మనసు తంగం సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలే‍కపోయింది. దీంతో జయం రవితో జత కట్టిన టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంపైన నివేథా చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం అంతరిక్షంలో జరిగే కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శక్తి సౌందర్‌రాజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే రాధాకృష్ణన్‌ ఇటీవల నటి నివేథా పేతురాజ్‌ను కలిసి కథను వినిపించారట. కథ నచ్చడంతో పాటు ప్రభుదేవాతో నటించడానికి ఈ అమ్మడు చాలా ఆసక్తిని కనబరిచిందట. ఈ విషయాన్ని దర్శకుడు సుమంత్‌ రాధాకృష్ణన్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద డాన్సింగ్‌కింగ్‌ ప్రభుదేవాతో రొమాన్స్‌ చేసే అవకాశాన్ని నివేథా పేతురాజ్‌ దాదాపుగా దక్కించుకున్నట్టే కనబడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement