Sudigali Sudheer Gaalodu Movie Gets OTT Release Date in Aha - Sakshi
Sakshi News home page

Sudigali Sudheer Gaalodu OTT Streaming: ఓటీటీకి వ‌చ్చేస్తోన్న సుడిగాలి సుధీర్‌ ‘గాలోడు’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే

Published Sun, Feb 12 2023 3:08 PM | Last Updated on Sun, Feb 12 2023 5:04 PM

Sudigali Sudheer Gaalodu Movie Gets OTT Release Date in AHA Videos - Sakshi

నటుడు, కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కామెడీ షోతో ఇండస్ట్రీకి వచ్చిన సుధీర్‌ స్టార్‌ హీరో రేంజ్‌లో ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కమెడియన్‌గా సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా అలరిస్తున్నాడు. ఇటీవల సుధీర్‌ నటించిన సినిమా గాలోడు. దర్శకుడు పులిచర్ల రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సుధీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గతేడాది నవంబర్‌ 18న థియేటర్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

చదవండి: ఆమిర్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ ఆందోళన! ఆయనకు ఏమైంది?

ఇందులో మాస్‌ హీరోగా మెప్పించాడు సుధీర్‌. దీంతో సుధీర్‌ ఈ చిత్రంతో మాస్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు చిత్ర ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. గాలోడు స్ట్రీమింగ్‌ రైట్స్‌ ఆహా వీడియోస్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది ఆహా. దీని ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి గాలోడు మూవీ ఆహాలో అందుబాటులోకి రానుంది. కాగా ఈ సినిమాలో గెహన సిప్పి హీరోయిన్‌గా నటించగా.. స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంకర్ త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు.

చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement