కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌ షో ప్రారంభమయ్యేది అప్పుడే! | Comedy Stock Exchange Show To Premiere On December 2 | Sakshi
Sakshi News home page

Comedy Stock Exchange Show: ఓటీటీ డెబ్యూకి అనిల్‌ రావిపూడి, సుడిగాలి సుధీర్‌ రెడీ

Published Sat, Nov 19 2022 5:56 PM | Last Updated on Sat, Nov 19 2022 6:07 PM

Comedy Stock Exchange Show To Premiere On December 2 - Sakshi

. ఇప్ప‌టిదాకా నేను చేసిందంతా ఆఫ్‌ కెమెరాలోనే. ఇప్పుడు ఆడియ‌న్స్‌కు నేను స‌రికొత్త‌గా ప‌రిచ‌యం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది”

నవ్వు.. మనసులోని అలజడులను, టెన్షన్‌లను పక్కకు నెట్టేస్తుంది. మనసుకు స్వాంతన చేకూరిస్తుంది. అలాంటి ఆహ్లాద‌క‌రమైన హాస్యాన్ని అందించ‌డానికి ముందుకొస్తోంది ఆహా. కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌ షోని డిసెంబర్‌  2 నుంచి ప్ర‌సారం చేయ‌నుంది. పాపుల‌ర్ క‌మెడియ‌న్స్ ఈ షోలో పార్టిసిపేట్ చేయ‌బోతున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు, ఎఫ్‌2, 3 సినిమాలతో స్టార్ డైరక్ట‌ర్‌గా అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన అనిల్‌ రావిపూడి ఈ షో ద్వారా ఓటీటీకి రంగ‌ప్ర‌వేశం చేస్తున్నాడు. కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌ షోకి ఆయ‌న చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 

సుడిగాలి సుధీర్‌, దీపిక పిళ్లై ఈ షోను హోస్ట్‌ చేయగా సెల‌బ్రిటీ క‌మెడియ‌న్స్ వేణు, ముక్కు అవినాష్‌, స‌ద్దాం, ఎక్స్ ప్రెస్ హ‌రి, భాస్క‌ర్‌, జ్ఞానేశ్వ‌ర్ స్టాక్స్ గా ఉంటారు. ప్రేక్ష‌కుల‌కు చక్క‌టి న‌వ్వుల‌తో గిలిగింత‌లు పెట్ట‌డానికి వారంద‌రూ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ షోలో మూడు రౌండ్స్ ఉంటాయి. స్టాక్ (క‌మెడియ‌న్‌)కి లైవ్ ఆడియ‌న్స్ ఓట్లు వేస్తారు. అక్క‌డ ఎక్కువ ఓట్లు గెలుచుకున్న‌వారు ఛైర్మ‌న్ మ‌న‌సు గెలుచుకుని టాప్ స్టాక్‌గా పేరు తెచ్చుకుంటారు. 10 ఎపిసోడ్లుగా సాగుతుంది ఈ షో. నిర్విరామంగా వినోదాన్ని పంచుతూ, ప్ర‌తి వీకెండ్‌నీ న‌వ్వుల‌మ‌యం చేయ‌బోతోంది.

కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌తో ఓటీటీలోకి ప్ర‌వేశిస్తున్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “హాస్యంలోని కోణాల‌ను ఆవిష్క‌రించ‌డానికి ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్ప‌టిదాకా నేను చేసిందంతా ఆఫ్‌ కెమెరాలోనే. ఇప్పుడు ఆడియ‌న్స్‌కు నేను స‌రికొత్త‌గా ప‌రిచ‌యం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది” అన్నాడు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ, “ఇన్నేళ్లుగా ప్రేక్ష‌కులు నా ప‌ట్ల చూపిస్తున్న ఆద‌ర‌ణ‌కు, ప్రేమ‌ను ధ‌న్య‌వాదాలు. వాళ్లు నా మీద పెట్టుకున్న న‌మ్మ‌కం ఇస్తున్న ప్రోత్సాహంతోనే నేను ప్ర‌తి అడుగూ ముందుకు వేస్తున్నాను. గ‌డ‌ప‌గ‌డ‌ప‌లోనూ ఈ షో ద్వారా న‌వ్వులు పూయిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ షోని చూసి నా ఫ్యాన్స్ ఎంత‌లా ఆస్వాదిస్తారో చూడాల‌ని ఉత్సాహంగా ఉంది" అన్నాడు.

చదవండి: పబ్లిక్‌గా టచ్‌ చేశాడు, చేయి పట్టుకుని లాగాను: సుష్మితా సేన్‌
టాప్‌ 10లో నుంచి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ ఎవరంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement