Sudigali Sudheer Remuneration for 'Gaalodu' Movie Goes Viral - Sakshi
Sakshi News home page

Sudigali Sudheer: ‘గాలోడు’ మూవీకి సుధీర్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Published Sat, Nov 19 2022 3:01 PM | Last Updated on Sat, Nov 19 2022 3:22 PM

Sudigali Sudheer Remuneration for Gaalodu Movie Goes Viral - Sakshi

నటుడు, కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కామెడీ షోతో ఇండస్ట్రీకి వచ్చిన సుధీర్‌ స్టార్‌ హీరో రేంజ్‌లో ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కమెడియన్‌గా సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా అలరిస్తున్నాడు. తాజాగా సుధీర్‌ నటించిన సినిమా గాలోడు. ఈ మూవీ నిన్న(నవంబర్‌ 18న) థియేటర్లో విడుదలైంది. విడుదలై తొలి షో నుంచి ఈ మూవీ మంచి టాక్‌ తెచ్చుకుంది. దీంతో గాలోడు చిత్రం సక్సెస్‌ వైపు దూసుకుపోతోంది.

చదవండి: బేబీ బంప్‌తో నిత్యా మీనన్‌! ఫొటోలు వైరల్‌

ఈ క్రమంలో ఈ మూవీకి సుధీర్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఆసక్తిగా మారింది. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్’ సినిమాతో హీరోగా పరిచమైన సుధీర్.. ఆ తర్వాత 3 మంకీస్ సినిమాలో నటించాడు. తాజాగా గాలోడు మూవీతో హీరోగా మరోసారి ఫ్యాన్స్‌ని అలరించాడు. అయితే ఈ సినిమాకు సుధీర్‌ తీసుకున్న పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సుమారు రూ. 40 నుంచి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మూడో సినిమాకే ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ తీసుకోవడంతో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ అప్‌కమ్మింగ్‌ హీరోకు ఇది భారీ రెమ్యునరేషన్‌ అనే చెప్పాలి.

చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్‌

మూడో సినిమాకే ఈ స్థాయిలో రెమ్యునేషన్‌ తీసుకున్న సుధీర్‌కు ఎంతటి క్రేజ్‌ ఉందో అర్థమవుతుందంటున్నారు నెటిజన్లు. సుధీర్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, ఆయన క్రేజ్‌ దృష్ట్యా నిర్మాతలు కూడా ఈ పారితోషికం ఇచ్చేందుకు వెనకాడలేదని తెలుస్తోంది. ఇక గాలోడు సినిమా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ రూ. 2 నుంచి రూ. 2.5 కోట్ల చేసినట్లు టాక్‌. ఇటీవల కామెడీ షో జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చిన సుదీర్‌ ఇప్పుడు మళ్లీ ఆ షోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు రీసెంట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement