
ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లుగా... ఒకే ఒక్క సినిమా అతడి కెరీర్‌నే మార్చేసింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. మంచి సినిమా కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తనకు "గాలోడు" రూపంలో ఘన విజయం లభించిందంటున్నాడు నటుడు రవిరెడ్డి. "గాలోడు" సక్సెస్ తనను గాల్లో విహరించేలా చేస్తోందంటున్నాడు.
అమెరికాలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసిన రవిరెడ్డి ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని, మోడలింగ్ సైతం చేశాడు. "ఇంటిలిజెంట్, దర్పణం, దొరసాని, డిగ్రీ కాలేజ్, వి, విరాటపర్వం, సాఫ్ట్‌వేర్ సుధీర్" తదితర చిత్రాలతో నటుడిగా ఇప్పటికే తన సత్తాను చాటుకున్నాడు. "గాలోడు" చిత్రంలో హీరోయిన్ తండ్రిగా నటనకు ఆస్కారమున్న ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చి తన నట జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకనిర్మాత "రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల"కు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నాడు రవిరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment