
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలలో వైఎస్ కుటుంబసభ్యులు పాల్గొని ప్రార్థనలు చేశారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డితోపాటు ఇతర కుటుంబసభ్యులు ఫాదర్ బెనహర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వైఎస్సార్ సోదరి విమలమ్మ క్రీస్తు సందేశాన్ని వివరించారు.
అనంతరం వివేకానందరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ప్రజలందరికి ఈ సందర్భంగా వారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనలలో వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్ మేనత్త కమలమ్మ, పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వారి కుమారులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతోపాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment