కాలిఫోర్నియా, బే ఏరియాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు | dr-ysr-72nd-birth-anniversary-celebrations-north-carolina | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియా, బే ఏరియాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Published Thu, Jul 22 2021 12:38 PM | Last Updated on Thu, Jul 22 2021 1:00 PM

dr-ysr-72nd-birth-anniversary-celebrations-north-carolina - Sakshi

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72 వ జయంతి వేడుకలు అమెరికాలో కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా జరిగాయి. బ్లూ ఫాక్స్ ఇండియన్ హోటల్ లో వైఎస్సార్‌ అభిమానులు,  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. యూఎస్‌ఏ వైస్సార్‌సీపీ కన్వినర్, ఏపీ  ప్రభుత్వ  పెట్టుబడుల సలహాదారు చంద్రహాస్ పెద్దమల్లు ,యూఎస్‌ఏ వైఎస్సార్‌సీపీ  గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కేవీ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి  కార్యక్రమం జరిగింది. వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కమిటీకి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ప్రతనిధులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు .

యూఎస్‌ఏ వైఎస్సార్‌సీపీ కన్వినర్, ఏపీ  ప్రభుత్వ  పెట్టుబడుల సలహాదారు చంద్రహాస్ పెద్దమల్లు మాట్లాడుతూ  ‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ ప‌థకాల‌ను ప్ర‌వేశపెట్టి వాటి ఫ‌లాల‌ను ప్ర‌తి పేద‌వాడికి అందించిన గొప్ప వ్య‌క్తి రాజశేఖర రెడ్డి. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్య దైవం,  ఎందరికో అసాధ్యమైన  అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి  దేశంలోనే  గుర్తింపు తెచ్చుకున్నారు.. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత దివంగత ముఖ్యమంత్రి, మహానేత  వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని కొనియాడారు.

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా, వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ, డాక్టర్ వైఎస్సార్‌ ఫౌండేషన్ "కమ్యూనిటీ సేవ" సంస్థ ద్వారా సుమారుగా 500 కుటుంబాలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమ్యూనిటీ సేవ సంస్థ ఫౌండర్ చైర్మన్  నాథన్ గణేశన్ వైఎస్సార్‌సీపీ యూఎస్‌ కమిటీ, డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ వారికి కృతఙ్ఞతలు తెలియచేశారు వైఎస్సార్‌సీపీ గవర్నింగ్ కౌన్సిల్  మెంబెర్ కేవీరెడ్డి  మాట్లాడుతూ..  దివంగత మహానేత రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్‌ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని  నిరంతరం తపించిన వ్యక్తి ఆయన అన్నారు. వైఎస్సార్‌ స్పూర్తితో , వారి ఆశయాలను వారి కుమారుడు నేటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నారు అని కొనియాడారు.

వైస్సార్సీ‌పీ యూఎస్‌  కమిటీ ముఖ్య సభ్యులైన సురేంద్ర అబ్బవరం, సుబ్రహ్మణ్యం రెడ్డివారి , హరిద్ర శీలం , కిరణ్ కూచిభట్ల త్రిలోకనంద రెడ్డి ఆరవ, మహేశ్వర్ రెడ్డి, వంశి ఏరువారం, పుల్లారెడ్డి లు మాట్లాడుతూ వైఎస్సార్‌ సంక్షేమ పాలనను వారితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజన్న రాజ్యం తిరిగి వారి తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమలో  బే ఏరియా వైఎస్సార్‌ అభిమానులు  అంకిరెడ్డి , గోపాల్, వీరారెడ్డి, హారిన్ద్ర శీలం, కొండారెడ్డి, సుగుణ, సుబ్బారెడ్డి, ప్రశాంతి, రామిరెడ్డి, నరేంద్ర కొత్తకోట, వినయ్, సుబ్బారెడ్డి ,తిరుపతిరెడ్డి పేరం, అమర్, రామిరెడ్డి , సురేష్ తనమల , అంకిరెడ్డి, వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ విభాగం నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement