
జూనియర్ జిహాదీ..
వీడి వయసు 4 ఏళ్లు. వీడో జిహాదీ!! బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో బులెట్లతో ఆడుకుంటున్నాడు. ఏకే 47 అంత లేడు.. అయినా దాన్ని పట్టుకుని బులెట్ల వర్షం కురిపిస్తున్నాడు. వీడు అల్‌ఖైదా ఉగ్రవాది!! ఈ పిల్లాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. సిరియా సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అల్‌ఖైదా ఈ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఈ పిల్లాడితోపాటు 9 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న పలువురు బాలురు తుపాకీలు పట్టుకుని.. శిక్షణ పొందుతున్న దృశ్యాలు ఉన్నాయి.