డ్యూటీలోని ఓ పోలీసు చేతిలో భారతీయ ఫైనాన్షియల్ బ్యాంకర్ హతమయ్యాడు. అతను తన రుణం విషయమై సదరు బ్యాంకర్‌తో వాదించి మరీ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన ఉగాండా రాజధాని కంపాల నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మే 12న ఉత్తమ్ భండారీ అనే ఫైనాన్షియల్ బ్యాంకర్‌పై 30 ఏళ ఇవాన్ వాబ్‌వైర్ కాల్పులు జరిపాడు. నిజానికి భండారీ టీఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. వాబ్‌వైర్ అతడి క్లయింట్. వాబ్‌వైర్ సంస్థ నుంచి మొత్తం రూ. 46 వేలు లోన్(రుణం) తీసుకున్నాడు.
ఆ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో వాబ్‌వైర్ ఏకే 47తో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో భండారీ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులో తీసుకుని అరెస్టు చేశారు. దర్యాప్తులో పోలీసులు వాబ్‌వైర్ డ్యూటీలో లేని ఓ పోలీసుగా పేర్కొన్నారు. తన సహచర ఉద్యోగి నుంచి ఏకే 47ని దొంగలించి మరీ అతడిపై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలిందన్నారు.
వాబ్‌వైర్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని, అందుకోసం రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న చరిత్ర కూడా ఉందని చెప్పారు. అతను ఈ విషయమై ఐదేళ్ల వరకు తుపాకిని కలిగి ఉండకుండా నిషేధించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఉగాండాలో ఈ విషయమై ఆందోళన చెందుతున్న భారతీయ కమ్యూనిటీలను కలుసుకుని వారి భద్రత విషయమై హామి ఇచ్చారు. కాగా, అందుకు సంబంధించిన వీడియో నెట్లింట వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment