భోపాల్: మధ్యప్రదేశ్‍లోని జబల్‌పుర్ రైల్వే స్టేషన్‌లో ఓ పోలీస్ రెచ్చిపోయాడు. వృద్ధుడు అనే కనికరం కూడా లేకుండా ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అతని మొహంపై పదే పదే తన్నాడు. అంతటితో ఆగకుండా కాళ్లుపట్టి ఈడ్చుకెళ్లి రైల్వే ట్రాక్‌పై వేలాడదీశాడు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోలీసు తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
A video of a uniformed cop kicking an elderly man at Jabalpur railway station has given rise to a wave of outrage at police. A passenger at the railway station had broadcast it live at the time of the incident @ndtv @ndtvindia pic.twitter.com/5PpijBPcw1
— Anurag Dwary (@Anurag_Dwary) July 29, 2022
పోలీస్ వృద్ధుడ్ని అంతలా కొడుతున్నా.. ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. అయితే సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. అతడ్ని సస్పెండ్ చేశారు. ఆ పోలీస్ పేరు అనంత్ శర్మ అని వెల్లడించారు.
మరోవైపు బాధితుడు గోపాల్ ప్రసాద్.. తనను పోలీసు ఎందుకు కొట్టాడో అర్థం కాలేదని తెలిపాడు. తనను ఓ వ్యక్తి తిడుతున్నాడని ఫిర్యాదు చేసేందుకు వెళ్తే విచక్షణా రహితంగా దాడి చేశాడని వాపోయాడు.
చదవండి: ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని ఇంటి తాళమిచ్చిన యజమాని.. రూ.10కోట్లతో చెక్కేసిన వ్యక్తి
Comments
Please login to add a commentAdd a comment