శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుంచి ఎన్‌సీ కార్యవనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ అశ్రఫ్ మిర్.. ఫలితాలు వెలువడగానే తన నివాసంలో ఏకే 47 రైఫిల్‌తో గాలిలో పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, తాను కాల్పులు జరపలేదని, తన భద్రతాధికారి తుపాకీ కిందపడితే.. తీసిచ్చానని మిర్ వివరణ ఇచ్చారు. కాగా, ‘ఏకే 47తో కాల్పులు జరిపిన మిర్‌పై పోలీసులు కేసు పెట్టే ధైర్యం చేయగలరా?’ అని ఒమర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ఏకే 47తో విజయోత్సవాలు!
Published Sat, Dec 27 2014 3:37 AM | Last Updated on Tue, Jun 4 2019 6:41 PM
Advertisement
Advertisement