the Assembly elections
-
ఏకే 47తో విజయోత్సవాలు!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుంచి ఎన్సీ కార్యవనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మొహమ్మద్ అశ్రఫ్ మిర్.. ఫలితాలు వెలువడగానే తన నివాసంలో ఏకే 47 రైఫిల్‌తో గాలిలో పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే, తాను కాల్పులు జరపలేదని, తన భద్రతాధికారి తుపాకీ కిందపడితే.. తీసిచ్చానని మిర్ వివరణ ఇచ్చారు. కాగా, ‘ఏకే 47తో కాల్పులు జరిపిన మిర్‌పై పోలీసులు కేసు పెట్టే ధైర్యం చేయగలరా?’ అని ఒమర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. -
ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు!
తొలిదశ రికార్డు పోలింగ్‌పై జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రధాని ప్రశంసలు మెజారిటీ ఇస్తే రాష్ట్రాన్ని వృద్ధి పథాన నిలుపుతా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ పూంఛ్/ఉధంపూర్: అసెంబ్లీ ఎన్నికల తొలిదశలో రికార్డు పోలింగ్ శాతం నమోదు చేసిన జమ్మూకశ్మీర్ ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలతో ముంచెత్తారు. బులెట్‌ను కాదని బ్యాలెట్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా వేర్పాటువాదులకు సరైన జవాబిచ్చారని అభినందించారు. ఫలితాలతో సంబంధం లేకుండా ఇది ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించారు. ‘బాంబులను, తుపాకీలను ఉపయోగించినా, ప్రజలను చంపినా.. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉండటంతో ఉగ్రవాదులు నిరాశానిస్పృహల్లో మునిగిపోయారు. మమ్మల్ని భయపెట్టడం ఇక కుదరదని మీరు వారికి తేల్చి చెప్పారు’ అని జమ్మూకశ్మీర్ ప్రజలను ప్రశంసించారు. దీనికి భారతీయులంతా మిమ్మల్ని అభినందిస్తున్నారన్నారు. డిసెంబర్ 2న జరగనున్న రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన పూంఛ్, ఉధంపూర్ల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫెరెన్స్, కాంగ్రెస్, పీడీపీలపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీలు అవినీతిలో కూరుకుపోయి, రాష్ట్రాన్ని దోచుకోవడంతో గత 30 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ప్రజలు తిరస్కరించినా.. సంకీర్ణ ప్రభుత్వాల పేరుతో విడతలవారీగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య, కుటుంబ రాజకీయాలు వ్యాధులని, రాష్ట్ర ప్రజలు సహకరిస్తే వాటిని నిర్మూలిస్తానని వ్యాఖ్యానించారు. ‘కేంద్రం భారీ ఎత్తున పంపిన నిధులు సక్రమంగా మీకు చేరితే.. దేశంలోనే మీరు అత్యంత సంపన్నులుగా ఉండేవారు’ అని పేర్కొన్నారు. మీ అభివృద్ధిని అడ్డుకున్న పార్టీల దుకాణాలను మూసేయండని ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు. ‘గతంలో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఆ పార్టీలే అధికారంలో ఉండటంతో.. మీ సొమ్మును యథేచ్ఛగా దోచుకున్నారు. నేను అధికారంలోకి వచ్చాక, నిధుల వినియోగంపై పట్టు బిగించడంతో నాపై కోపం పెంచుకున్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధికి నిధుల కొరత ఉండదు. కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఈ రాష్ట్ర ప్రజలకు కూడా సమాన హక్కు ఉంది’ అన్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ఇస్తే.. గత 30 ఏళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధిని ఐదేళ్లలో సాధిస్తానని, అవినీతికి తావు లేకుండా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. ఇటీవలి వరదలను ప్రస్తావిస్తూ.. ‘మీ బాధను నా బాధలా భావించాను. మీ కన్నీళ్లు తుడవడం కోసం దీపావళి కూడా జరుపుకోకుండా ఇక్కడికి వచ్చాను’ అని గుర్తు చేశారు. పూంఛ్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. ‘న్యూఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి 24 గంటల సమయం మాత్రమే పడుతుంది. కానీ గత 40 ఏళ్లలో ఏ ఒక్క ప్రధాని ఇక్కడికి రాలేదు’ అన్నారు. 40 ఏళ్ల క్రితం మొరార్జీ దేశాయి వచ్చారని, ఇప్పుడు తాను వచ్చానని చెప్పారు. ‘ప్రధానిగా ఇక్కడికి మొదటిసారి వచ్చాను కానీ.. అంతకుముందు పార్టీ కార్యక్రమాల కోసం చాలాసార్లు బస్‌లో వచ్చాను. అప్పుడు చాలామంది నాకు ఆతిథ్యం ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి వారందరి రుణం తీర్చుకోవాలని ఉంది’ అన్నారు. -
టికెట్లు..ఇక్కట్లు
టీడీపీలో గందరగోళం టికెట్ల కేటాయింపులో కొరవడిన స్పష్టత పెరిగిపోతున్న గ్రూపుల గోల కత్తులు దూసుకుంటున్న పాత, కొత్త నేతలు టికెట్లపై తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు పార్టీ కేడర్‌లో అయోమయం టీడీపీలో టికెట్ల గోల కొంపముంచుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా టికెట్లపై వివాదం తేలలేదు. చేరికలతో పాత, కొత్త అంటూ సీట్ల పోటీ పెరిగిపోతోంది. దీంతో ఎవరికి సీటు ఇవ్వాలో తెలియక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: టీడీపీలో ప్రస్తుతం నియోజక వర్గ ఇన్‌చార్జుల్లో ఒకరిద్దరు మినహా సమర్థులైన నేతలు లేకపోవడంతో టికెట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. బీజేపీతో పొత్తు ఖరారైతే కనీసం రెండు సీట్లయినా నగరంలో ఆ పార్టీకి ఇవ్వాల్సి ఉండడం, కుల సమీకరణలు తోడవడంతో అభ్యర్థులను ప్రకటించే విషయంలో తేల్చుకోలేకపోతున్నారు. విశాఖ తూర్పులో వెలగపూడికి టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతున్నా బీజేపీతో పొత్తుపెట్టుకుంటే ఈ సీటు ఆ పార్టీకి వదలుకోవాల్సి ఉంటుందనే అంచనాలున్నాయి. ఉత్తరంలో భరణికానతో పంచకర్ల రమేష్ పోటీపడుతున్నారు. యాదవ సామాజిక వర్గం కింద తనకే కేటాయించాలని భరణికాన పోరాటం చేస్తున్నారు. పొత్తుతో బీజేపీకి పోతుందేమోనని ఇక్కడివారు కలవరపడుతున్నారు. పశ్చిమంలో గణబాబుకు దాదాపుగా టికెట్ ఖరారయింది. ఇక దక్షిణంలో తాజాగా వాసుపల్లికి రెహమాన్ పోటీ తగిలారు. మరోపక్క లొడగల కృష్ణ కూడా యనమల ఆశీస్సులతో టికెట్ ఆశిస్తున్నారు. భీమిలిపై అవంతి శ్రీనివాస్‌కు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సకురు రఘువీర్, అప్పలనరసింహరాజులతో పాటు మరికొందరు రేసులో ఉన్నారు. పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ ఖాయమైందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీలో కొత్తగా చేరిన చింతలపూడి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. కొన్నేళు ్లగా పనిచేస్తున్న కోన తాతారావుకు అయ్యన్న, యనమల ఆశీస్సులున్నాయి. టికెటివ్వకపోతే రెబల్‌గా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. పల్లా శ్రీనివాస్ కూడా చేరడంతో టికెట్ ముడి మరింత బిగుసుకుంది. జిల్లా స్థానాలూ జఠిలమే అనకాపల్లిపై గంటా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడుకే ఇక్కడ సీటు ఇవ్వనున్నారు. ఈయన తన కుమారుడికి అనకాపల్లి పార్లమెంట్ స్థానం అడుగుతున్నారు. ఈ సీటు ఇవ్వకపోతే అయ్యన్న నర్సీపట్నం నుంచి పోటీచేస్తారా?.. లేదా?.. ఆయన తనయుడిని బరిలోకి దించుతారా? అనేది తేలాల్సి ఉంది. యలమంచిలిలో కన్నబాబురాజు టీడీపీలోకి చేరినా టికెట్ హామీ లభించలేదు. ప్రస్తుత నియోజక వర్గ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్, మాజీ ఎంపీ పప్పుల చలపతిరావు కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఒకరికి టికెట్ ఇస్తే రెండో వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. చోడవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు ఉన్నారు. గూనూరు మల్లునాయుడు, బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ బి.సత్యపాపారావు ప్రయత్నిస్తున్నారు. కేఎస్‌ఎన్‌కు కాకుండా స్థానికంగా ఎక్కువ ఓటర్లు ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన మల్లునాయుడుకు ఇవ్వాలని పార్టీ ఆలోచన. దీనిపై పార్టీ ఒక అవగాహనకు రాలేదని తెలిసింది. మాడుగులలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు. వైద్యుడైన ముర్రు జయచంద్రనాయుడు, పీఆర్పీ నుంచి పోటీచేసి ఓడిపోయిన సాఫ్ట్వేర్ కంపెనీల అధినేత, ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడా తేల్చలేదు. పాడేరులో నాయకత్వ సమస్య ఉంది. మణికుమారి, కొత్తగుల్లి సుబ్బారావు, వంజంగి కాంతమ్మ, మాజీ ఎమ్మెల్యే ఎం.వి.ఎస్.సత్యనారాయణ తనయుడు ఎం.వి.ఎస్.ప్రసాద్ బరిలో ఉన్నారు. కానీ వీరి మధ్య తీవ్రంగా గ్రూపులుండడంతో టికెట్ ఎవరికి ఇవ్వాలో పార్టీ తేల్చుకోలేకపోతోంది. అరకులో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిరివేము సోమ. బీఎస్పీ పార్టీ నుంచి గతంలో అసెంబ్లీ అభ్యర్థిగా ఓడిపోయిన పాంగి రాజారావు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. పాయకరావుపేటలో వంగలపూడి అనితకు టికెట్ ఖరారయిందని ప్రచారం జరిగినా గ్రూపు తగాదాల నేపథ్యంలో మళ్లీ నిర్ణయం వాయిదా పడింది.