ఏకే-47లతో క్రికెట్ ఆడుకున్నఉగ్రవాదులు
జమ్ము-కశ్మీర్: క్రికెట్ అంటే భారత్‌లో జనాలకు అదో పిచ్చి. ఎక్కడ పడితే అక్కడే క్రికెట్ ఆడతారు. గల్లీల్లో, స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు ఎక్కడైనా సందు దొరికితే ఆటాడేస్తారు. చిన్నా పెద్ద తేడా ఉండదు ఆటలో. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆట ఆడేటప్పుడు వికెట్లకోసం బండలు, ఇటుకలు, రాళ్లు, కర్రలు నిలపెట్టుకుంటాం.
క్రికెట్‌కు ఉగ్రవాదులు మినహాయింపేం కాదు. వాళ్లు కూడా క్రికెట్ ఆడుకున్నారు. కశ్మీర్‌లోని తరచూ దాడులు జరుపుతూ తమ ఉనికిని చాటుకునే హిజ్బుల్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు క్రికెట్ ఆడుకున్నారు. కాకపోతే అందరూ ఏ రాయినో, ఇటుకలనో వికెట్లుగా పెట్టకొని ఆడుకుంటారు. కానీ వీళ్లు మాత్రం ఏకే-47 తుపాకులను వికెట్లుగా పెట్టుకొని ఆడుకున్నారు. ఇప్పుడు ఆవీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మీరు చూడండి.