పోలీసు శునకం వీరమరణం
పారిస్: పారిస్‌లో బుధవారం జరిగిన పోలీసుల షూటౌట్‌లో డీజిల్ అనే బెల్జియన్ షెపర్డ్ జాతి పోలీసు శునకం వీరమరణం పొందింది. ఆపరేషన్‌లో భాగంగా.. సెయింట్ డెనిస్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో ఉగ్రవాదుల ఆచూకీ తెలుసుకునేందుకు ముందుగా డీజిల్‌ను పంపించారు. పోలీసుల లక్ష్యం వరకు డీజిల్ జాగ్రత్తగానే వెళ్లింది. ఇంతలోనే ఉగ్రవాద గ్రూపులోని ఓ మహిళ.. ఏకే-47 తుపాకీతో పోలీసులపై కాల్పులు ప్రారంభించింది.
పోలీసులు ఆమెను లొంగిపోమ్మని హెచ్చరిస్తుండగానే.. ఆ మహిళ తనను తాను పేల్చుకోవటంతో.. అక్కడే ఉన్న డీజిల్ శరీరం రెండు ముక్కలైంది. డీజిల్ మరణాన్ని పారిస్ పోలీసులు తట్టుకోలేకపోయారు. ప్రత్యేకంగా తయారు చేయించిన శవపేటికపై ‘ఓ ఆత్మీయుడిని కోల్పోయాం’ అని రాసి ఘనంగా నివాళులర్పించారు. ‘జాతీ య భద్రతలో డీజిల్ కన్నుమూసిందంటూ’ ట్వీట్‌లు చేశారు.