
ఉత్తరప్రదేశ్‌లో అద్దెకు ఏకే 47లు..!
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఏకే 47 లాంటి ఆధునిక ఆయుధాలు అమ్మకానికే కాదు.. అద్దెకు కూడా లభిస్తున్నట్లు తాజాగా తేలింది. స్థానిక బీజేపీ నేత బ్రిజ్‌పాల్ తియోతియా హత్య కేసును విచారిస్తున్న క్రమంలో పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఒక్కో ఏకే 47కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డిపాజిట్ పెట్టుకుని స్థానిక గ్యాంగ్‌లు వాటిని అద్దెకు ఇస్తుంటాయి.
అద్దెకు తీసుకున్న తుపాకీని తిరిగిచ్చినప్పుడు రూ.50 వేల నుంచి 60 వేల వరకు మినహాయించుకుని డిపాజిట్‌ను తిరిగిస్తారు. ఒకవేళ తుపాకీని పోగొడితే.. ఆ డిపాజిట్ తిరిగివ్వరు. ఢిల్లీ సరిహద్దుల్లోని యూపీ ప్రాంతంలో కొన్ని గ్యాంగ్‌లు హత్యలను సబ్ కాంట్రాక్ట్‌కు ఇస్తూ, వారికి ఇలా ఆయుధాలను అద్దెకిస్తుంటారు. కొందరు గ్యాంగ్ లీడర్లు జైళ్లలో నుంచి కూడా ఈ బిజినెస్‌ను నడిపిస్తుంటారట