ఏకే-47 తయారు చేసి తప్పు చేశాను: కలష్నికోవ్
ఏకే-47 తయారు చేసి తప్పు చేశాను: కలష్నికోవ్
Published Mon, Jan 13 2014 4:52 PM | Last Updated on Tue, Jun 4 2019 6:41 PM
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకుల మరణాలకు కారణమైయ్యాననే కారణంతో ఏకే-47 రూపశిల్పి మిఖాయిల్ కలష్నికోవ్ తన మరణానికి ముందు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. భయకరమైన అత్యాయుధాన్ని రూపొందించినందుకు కుమిలిపోతూ మాస్కో పాట్రియార్క్, ఆల్ రష్యా క్రిరిల్ 1 కు తన మరణానికి ఆరు నెలల ముందు గత డిసెంబర్ లో లేఖ రాశారు.
తాను రూపొందించిన ఆయుధం కారణంగా అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతుండటం ఆయనను ఆందోళనకు గురిచేస్తోందని లేఖలో వెల్లడించారు. ఆయన రష్యాలోని ఓ సాంప్రదాయ చర్చి అధినేతతో తన బాధను పంచుకున్నట్టు ఇజ్వేషియా దినపత్రిక ఓ కథనం వెలువడింది.
'నేను రూపొందించిన ఏకే-47 ఆయుధం అనేక ప్రాణాల మంది మరణానికి కారణమవుతోంది. సమాధానం దొరకని అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. లోలోపల చాలా బాధపడుతున్నాను' అని చర్చి పెద్దతో కలష్నికోవ్ తన బాధను పంచుకున్నారని తెలిపారు. మన దేశంలో ఎన్నో చర్చిలు, శాంతి సంఘాలు ఏర్పడ్డాయి. అయినా ఉగ్రవాదమనే భూతాన్ని తుదముట్టించలేకపోయాయి.
మంచి-చెడు, వెలుగు-నీడలు అనేవి ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. ఒకటి లేక మరొకటి ఉండవు. వాటిని ఇలాగేనా దేవుడు రూపొందించేది?. ఇలాంటి పరిస్థితిలోనే మానవాళి జీవించాల్సిందేనా అని కలష్నికోవ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఇటీవల చర్చిపై దాడి జరిగిన సమయంలోనే కలష్నికోవ్ లేఖను రాసినట్టు ఇజ్వేషియా వెల్లడించింది.
Advertisement
Advertisement