
ఏకే-47తో ఆర్మీ జవాను అదృశ్యం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఓ ఆర్మీ జవాను అదృశ్యమయ్యాడు. పుల్వామాకు చెందిన జవాను జహుర్ ఠాకూర్ ఏకే-47 తుపాకీతో సహా అదృశ్యమైన సంఘటన బారాముల్లా జిల్లా గాంట్‌ముల్లా క్యాంప్‌లో చోటుచేసుకుంది. జవాను మిస్సింగ్ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఆర్మీ అధికారి తెలిపారు. కాగా తీవ్రవాదుల కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకే అతడు ఆర్మీ క్యాంప్ నుంచి తప్పించుకుని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.