పోలీసులు స్వాధీనం చేసుకున్న ఏకే47
హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యారడైజ్ సెంటర్లో ఒక వ్యక్తి ఏకే 47 గన్ పట్టుకొని తిరుగుతుండటం సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన వెంటనే ఉత్తర మండలం టాస్క్ ఫర్స్ పోలీసులు రంగంలోకి దిగి ఆ గన్ పట్టుకు తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
బీహార్కు చెందిన అఖిలేష్ అనే వ్యక్తి ఏకే 47 పట్టుకొని తిరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. అతనిని అరెస్ట్ చేసి, ఆ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత అతనిని రిమాండ్ కు తరలించారు.