పది ఏకే-47 తుపాకుల లూటీ
సుకుమా: ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ పై దాడికి పాల్పడిన తర్వాత మావోయిస్టులు జవానుల నుంచి అత్యాధునిక ఆయుధాలు ఎత్తుకెళ్లారు. 10 ఏకే-47, 56 తుపాకులు తీసుకెళ్లారు. 3 ఏకే-47 తుపాకుల్లో అత్యాధునిక సదుపాయాలున్నాయి. వీటిని అంబర్ బ్యారెల్ డ్రెనేడ్ లాంఛర్స్ కు ఫిట్ చేసినట్టు సీఆర్పీఎఫ్ వెల్లడించింది.
మావోయిస్టులు ఎత్తుకెళ్లిన ఆయుధాల్లో ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఐఎన్ ఎస్ఏఎస్ రైఫిల్, 400 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయని తెలిపింది. మావోయిస్టుల ఏరివేతకు వెళ్లిన జవాన్లలో చాలా మంది అడవిలో ఉన్నారని, ప్రస్తుతానికి కూంబింగ్ నిలిపి వేశామని సీఆర్పీఎఫ్ ప్రకటించింది. సుకుమా జిల్లాలో సోమవారం మావోయిస్టులు జరిపిన దాడిలో 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.