ఏకే47 తయారు చేసిన యువకుడు | East godavari youth creates ak47 with wood | Sakshi
Sakshi News home page

ఏకే47 తయారు చేసిన యువకుడు

Published Fri, Mar 3 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

ఏకే47 తయారు చేసిన యువకుడు

ఏకే47 తయారు చేసిన యువకుడు

 
పిఠాపురం : ఈ చిత్రంలో సైనిక దుస్తులు ధరించి, చేతిలో ఏకే 47 గన్‌ చేతపట్టి కనిపిస్తున్న ఈ యువకుడి పేరు పంపన నాగేంద్ర. ఊరు కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు వెంకటరాయపురం. తండ్రి వెంకటరమణ వడ్రంగి పని చేస్తుంటాడు. నాగేంద్ర పదోతరగతి పూర్తి చేసి ఐటీఐ చదువుతున్నాడు. ఇతడికి సైనికులన్నా.. పోలీసులన్నా చాలా ఇష్టం. ఎప్పటికైనా సైనికుడై దేశానికి సేవ చేయాలన్నది అతడి తపన. ఆయుధాలు ధరించి శత్రువులపై సైనికులు పోరాడే దృశ్యాలు కనిపిస్తే చాలు సోల్జర్‌గా ఊహించుకుంటాడు. ఆ పాత్రలో లీనమైపోతాడు.  

అయితే చదువు, ఎన్నో పరీక్షలు, పోటీలు ఎదుర్కొంటే తప్ప సైనికుడు కాలేమని గ్రహించిన ఆ యువకుడు ఆ యూనిఫాంను కుట్టించేసుకున్నాడు. అంతేకాదు సైనికులు వినియోగించే ఆయుధం(ఏకే 47)ను తయారు చేయాలని నిర్ణయించకున్నాడు. దానికోసం తన తండ్రి వండ్రంగి పనిలో ఉపయోగించే చెక్కను ఇంట్లో ఉన్న సైకిల్‌ పంపు బ్యాగ్‌ బెల్టు, కొంత ప్లాస్టిక్‌ సామాన్లను ఉపయోగించి కేవలం నాలుగు రోజుల్లో రూ.250 ఖర్చుతో ఏకే-47 గన్‌ను తయారు చేశాడు.

బుల్లెట్లను సైతం చెక్కతో రూపొందించాడు. గన్‌లో బుల్లెట్‌ వేసి పేల్చగానే అవి సుమారు పది మీటర్ల దూరం దూసుకుపోతాయని నాగేంద్ర చెబుతున్నాడు. ఇటీవల కాకినాడలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి వెళ్లగా పరుగు పందెంలో రాణించలేక ఆర్మీలోకి వెళ్లే అవకాశం పోయిందని, అయితే ఎప్పటికైనా తాను సైనికుడినై తీరతానని అంటున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement