కొండపాక: నడుస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో నుంచి ‘ఏకే 47 తుపాకీ బైనట్’ కింద పడిన ఘటనలో రెండు గంటలపాటు హైడ్రామా నడిచింది. కరీంనగర్‌జిలాల్ల గంగాధరం పోలీస్‌స్టే షన్‌కు రెండు కిలో మీటర్ల దూరంలోని కురుక్యాలలో దీన్ని పడేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పాటు పోలీసు స్టేషన్ ముందున్న సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో బస్సును ట్రేస్ చేసిన గంగాధరం ఎస్‌ఐ మొగిలి... వెంటనే మెదక్ జిల్లాలోని సిద్దిపేట పోలీసులను అప్రమత్తం చేశారు. ఏకే 47 బైనట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో జగిత్యాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళుతున్న ఈ బస్సును కొండపాకలోని లకుడారం గ్రామంలోని రాజీవ్ రహదారిపై... సిద్దిపేట సీఐ ప్రసన్నకుమార్, కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డిల బృందం ఆపింది.
అంతా గందరగోళం!
లకుడారంలో బస్సు ఆపిన పోలీసులు ప్రయాణికులను అణువణువూ తనిఖీ చేశారు. ఇందు లో మొత్తం 32 మంది ప్రయాణికులున్నారు. ఒక్కొక్కరి వివరాలు నమోదు చేసుకున్నారు. వారి బయోటేటాలు, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఐడెంటీ కార్డులు సరిచూశారు. ఈ తతంగమంతా చూసి ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి లోనయ్యారు. ఈ లోగా గంగాధరం ఎస్‌ఐ వచ్చి విషయం చెప్పడంతో భయభ్రాంతులకు లోనయ్యారు.
మక్కాకు వెళుతున్న ఇద్దరు వ్యక్తుల వద్ద సరైన ఐడీ కార్డులు, ప్రూఫ్‌లు లేకపోవడంతో వారి వివరాలు, ఫొటోలు, ఫోన్ నంబర్లు తీసుకున్నారు. ఈ విషయం మండలమంతా వ్యాపించింది. అసలేం జరుగుతుందో తెలుసుకొనేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ లోపు అక్కడికి వచ్చిన ఎస్‌ఐ మొగిలి... సీసీ కెమెరాల ఫుటేజీ, స్థానికులు తెలిపిన వివరాల ఆధారంగా బస్సును గుర్తించగలిగామన్నారు. తమకు లభించిన ఈ బైనట్ ఏకే47కు కీలకమైన పార్ట్ అని తెలిపారు.
రెండు గంటలు హైడ్రామా
Published Sun, Jun 28 2015 1:16 AM | Last Updated on Tue, Jun 4 2019 6:43 PM
Advertisement
Advertisement