the bus
-
రెండు గంటలు హైడ్రామా
కొండపాక: నడుస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో నుంచి ‘ఏకే 47 తుపాకీ బైనట్’ కింద పడిన ఘటనలో రెండు గంటలపాటు హైడ్రామా నడిచింది. కరీంనగర్‌జిలాల్ల గంగాధరం పోలీస్‌స్టే షన్‌కు రెండు కిలో మీటర్ల దూరంలోని కురుక్యాలలో దీన్ని పడేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పాటు పోలీసు స్టేషన్ ముందున్న సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో బస్సును ట్రేస్ చేసిన గంగాధరం ఎస్ఐ మొగిలి... వెంటనే మెదక్ జిల్లాలోని సిద్దిపేట పోలీసులను అప్రమత్తం చేశారు. ఏకే 47 బైనట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో జగిత్యాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళుతున్న ఈ బస్సును కొండపాకలోని లకుడారం గ్రామంలోని రాజీవ్ రహదారిపై... సిద్దిపేట సీఐ ప్రసన్నకుమార్, కుకునూర్‌పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డిల బృందం ఆపింది. అంతా గందరగోళం! లకుడారంలో బస్సు ఆపిన పోలీసులు ప్రయాణికులను అణువణువూ తనిఖీ చేశారు. ఇందు లో మొత్తం 32 మంది ప్రయాణికులున్నారు. ఒక్కొక్కరి వివరాలు నమోదు చేసుకున్నారు. వారి బయోటేటాలు, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఐడెంటీ కార్డులు సరిచూశారు. ఈ తతంగమంతా చూసి ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి లోనయ్యారు. ఈ లోగా గంగాధరం ఎస్ఐ వచ్చి విషయం చెప్పడంతో భయభ్రాంతులకు లోనయ్యారు. మక్కాకు వెళుతున్న ఇద్దరు వ్యక్తుల వద్ద సరైన ఐడీ కార్డులు, ప్రూఫ్‌లు లేకపోవడంతో వారి వివరాలు, ఫొటోలు, ఫోన్ నంబర్లు తీసుకున్నారు. ఈ విషయం మండలమంతా వ్యాపించింది. అసలేం జరుగుతుందో తెలుసుకొనేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ లోపు అక్కడికి వచ్చిన ఎస్ఐ మొగిలి... సీసీ కెమెరాల ఫుటేజీ, స్థానికులు తెలిపిన వివరాల ఆధారంగా బస్సును గుర్తించగలిగామన్నారు. తమకు లభించిన ఈ బైనట్ ఏకే47కు కీలకమైన పార్ట్ అని తెలిపారు. -
స్కూల్‌బస్సుల్లో పిల్లల జాబితా !
తప్పని సరి చేయనున్న ఆర్టీఏ నేడు పాఠశాల యాజమాన్యాలతో సమావేశం సాక్షి,సిటీబ్యూరో: స్కూళ్లు, కాలేజీలకు నడిచే బస్సుల్లో ఇక నుంచి పిల్లలు (విద్యార్థులు) జాబితా తప్పనిసరి కానుంది. ఆ బస్సులో ప్రతి రోజు రాకపోకలు సాగించే పిల్లల పేర్లు, తరగతి, పాఠశాల/ కాలేజీ పేరు, చిరునామా వం టి వివరాలను తప్పనిసరిగా బస్సు లోపల జా బితా రూపంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. పై గా డ్రైవర్లు, సహాయకులు, ఆ రూట్లో నడిచే బస్సులను తరచుగా మార్చడానికి వీల్లేకుండా కఠినమైన నిబంధనలు అమలు చేసేందుకు ఆర్టీఏ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు పాఠశాల యాజమాన్యాల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆర్టీఏ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 6,527 స్కూల్, కళాశాలల బస్సులున్నాయి. ప్రస్తుతం వీటిలో చాలా బస్సుల నిర్వహణ అడ్డగోలుగా ఉంది. విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లపై చూపుతున్న శ్రద్ధ వాటి నిర్వహణ పైన చూపడం లేదు. పైగా శని, ఆదివారాలు, వరుస సెలవులు, వేసవి సెలవులు వస్తే చాలు పిల్లల బస్సులను పెద్దల రవాణా కోసం వినియోగిస్తూ రహదారి భధ్రతా నిబంధనలకు విఘాతం కలిగిస్తున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బస్సుల్లో పిల్లలు మాత్రమే పయనించాలనే ప్రాథమిక నిబంధన కూడా అమలుకు నోచుకోవడం లేదు.పైగా ప్రతి రోజు రాకపోకలు సాగించే స్కూల్ బస్సుల్లో, ఏ బస్సులో ఏ పిల్లలు ఉన్నారో, ఎంతమంది ప్రయాణిస్తున్నారో, వారి పేర్లేంటే తెలియదు. మరోవైపు కొన్ని పాఠశాల యాజమాన్యాలు తరచుగా బస్సులను డ్రైవర్లను మార్చడం కూడా వాటి నిర్వహణలో ఇబ్బందికరంగా మారుతోంది. ఇక ఎప్పటికప్పుడు కొత్తగా విధుల్లో చేరే డ్రైవర్లు, సహాయకుల వల్ల వారికి పిల్లలతో ఎలాంటి అనుబంధం ఏర్పడటం లేదు. కొంతమంది పిల్లల గమ్యస్థానాలు కూడా సరిగ్గా తెలియని డ్రైవర్లు, సిబ్బంది ఉన్నారు. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనుభవజ్ఞులైన డ్రైవర్లు, సహాయకులు ఒకే రూట్లో స్థిరంగా పని చేసేవిధంగా మార్పులు తీసుకురావాలని ఆర్టీఏ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు నేతృత్వంలో ఉప్పల్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పాఠశాల యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. -
బస్సును ఢీకొన్న లారీ
ధారూరు: నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లతో పాటు బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కేరెళ్లి సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ప్రయాణికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఓ సూపర్ లగ్జరీ బస్సు(టీఎస్ 07 జెడ్ 4055) తాండూరు డిపో నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. నగరం నుంచి తాండూర్లోని విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీకి ఓ లారీ (ఏపీ 09 వై 5448) వస్తోంది. నిద్ర మత్తులో ఉన్న లారీ డ్రైవర్ వెంకటేశ్ అతి వేగంగా వాహనం నడుపుతున్నాడు. ఉదయం 10.15 గంటల సమయంలో కేరెళ్లి గ్రామం సమీపంలో గాలి పోచమ్మ ఆలయ మలుపులో ఎదురుగా వస్తున్న లారీని గమనించిన బస్సు డ్రైవర్ వెంకటయ్య తీవ్రంగా హారన్ మోగించినా ఫలితం లేకుండా పోయింది. బస్సు డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతూ వాహనాన్ని ఎడమ వైపునకు మళ్లించాడు. నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ కుడివైపునకు రాంగ్రూట్లో వచ్చాడు. బస్సును సమీపించిన తరుణంలో హారన్‌కు ఉలిక్కిపడిన లారీ డ్రైవర్ వెంకటేశ్ ఒక్కసారిగా లారీని ఎడమ వైపునకు తీసుకున్నాడు. ఈక్రమంలో లారీ వెనుకభాగం బస్సు ముందు భాగంలో ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లకు గాయాలయ్యాయి. బస్సు కుదుపునకు గురవడంతో ప్రయాణికులు 15 మంది ముందు సీట్లకు తగిలి స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం ప్రయాణికులు వేరే బస్సులో వెళ్లిపోయారు. బస్సు డ్రైవర్ వెంకటయ్య ధారూరు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. లారీతో పాటు డ్రైవర్ వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగభూషణం తెలిపారు. -
ఎస్సెమ్మెస్ కొట్టు.. బస్సు పట్టు
సెల్ ద్వారా బస్సుల రాకపోకల సమాచారం త్వరలోనే సిటీలో అందుబాటులోకి సాక్షి,సిటీబ్యూరో : రమేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైటెక్ సిటీకి వెళ్లేందుకు ఉదయం 9కి వనస్థలిపురం బస్టాప్‌కు చేరుకున్నాడు. బస్సు కోసం ముప్పావు గంటకు పైగా పడిగాపులు కాయాల్సి వచ్చింది. విలువైన సమయం బస్సు కోసం నిరీక్షించేందుకే వెచ్చించాల్సి వచ్చింది. కానీ తాను ఇంటి నుంచి బయలుదేరడానికి ముందే వనస్థలిపురం నుంచి హైటెక్‌సిటీకి వెళ్లేందుకు ఏ సమయానికి బస్సు ఉందో తెలుసుకోగలిగితే ఆ విలువైన సమయాన్ని మరో పని కోసం వినియోగించుకొనే అవకాశం ఉండేది. సరిగ్గా ఇలాంటి సిటీ బస్సు సమాచార సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు తమ సమీపంలోని బస్‌షెల్టర్ కోడ్‌ను, తాము వెళ్లవలసిన రూట్ నెంబర్‌ను ఎస్సెమ్మెస్ ద్వారా ఆర్టీసీకి చేరవేస్తే చాలు. క్షణాల్లో ఆ రూట్లో వెళ్లే బస్సులు,ఆ బస్‌షెల్టర్‌కు ఏ సమయానికి చేరుకుంటాయో సంక్షిప్త సందేశం రూపంలో ప్రయాణికుల ఫోన్‌కు వచ్చేస్తుంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రయాణికులు బస్టాపుల్లో పడిగాపులు కాయకుండా ఆఫీసు నుంచి, ఇంటి నుంచి తాము బయలుదేరే సమయానికి అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను ముందే తెలుసుకొని బయటకు రావచ్చు. మరో నెల రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నగరంలోని వందకు పైగా ప్రధాన బస్షెల్టర్లలో మొదట ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం ఆ షెల్టర్లన్నింటికీ ప్రత్యేక కోడ్ నెంబర్లను కేటాయిస్తారు. ప్రయాణికులు ఎస్సెమ్మెస్ చేసేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెడతారు. ప్రస్తుతం రైళ్ల సమాచారాన్ని తెలుసుకొనేందుకు అందుబాటులో ఉన్న విధానం తరహాలోనే సిటీ బస్సుల సమాచారం తెలుసుకొనేందుకు అవకాశం కలుగుతుంది. పొరుగున ఉన్న మైసూర్లో 500 సిటీ బస్సులకు ఈ సదుపాయం ఉంది. నగరంలో తొలుత 1000 బస్సుల్లో దీన్ని ప్రవేశపెడతారు. దశల వారీగా అన్నింటికీ విస్తరిస్తారు. మరో నెల రోజుల్లో ఈ సదుపాయం ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ (వీటీపీఐ) పరిజ్ఞానం ఆధారంగా దీన్ని అమలు చేస్తారు. మరో మూడు రూట్లకు వెహికిల్ ట్రాకింగ్ విస్తరణ... ప్రస్తుతం నగరంలోని రెండు రూట్లలో అమలు జరుగుతున్న వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థను మరో 3 రూట్లకు విస్తరించనున్నారు. కోఠీ-లింగంపల్లి (222), వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ-కొండాపూర్ (127కె) రూట్లో ప్రయోగాత్మకంగా వెహికల్ ట్రాకింగ్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ట్రయల్న్‌గ్రా 46 బస్సుల్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఆ రెండు రూట్లలో బస్సుల రాకపోకల వివరాలు బస్సుల్లోని ఎల్ఈడీ బోర్డుల్లో ప్రదర్శించడంతో పాటు, ఎంపిక చేసిన బస్షెల్టర్లలో కూడా ప్రదర్శిస్తారు. ఈ సదుపాయాన్ని త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. ఉప్పల్-కొండాపూర్ (113కె), సికింద్రాబాద్-హెటెక్‌సిటీ (10హెచ్),ఉప్పల్-మెహదీపట్నం (113ఎం) రూట్లలో వెహికల్ ట్రాకింగ్‌ను విస్తరించనున్నారు.