హైదరాబాద్లో పెరిగిన నేరాలు | Crime rate is up in Hyderabad, say cp mahendar reddy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో పెరిగిన నేరాలు

Published Sat, Dec 27 2014 1:07 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో పెరిగిన నేరాలు - Sakshi

హైదరాబాద్లో పెరిగిన నేరాలు

హైదరాబాద్ : భాగ్యనగరంలో ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం 2014లో జరిగిన నేరాలపై మాట్లాడుతూ.. 40 శాతం సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. నేరాల సంఖ్యను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. నేరాలను నిరోధించడానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 2,564 టాస్క్‌ఫోర్స్ కేసులు ఛేదించామని తెలిపారు.

ఇక రాజధాని పరిధిలో 10 శాతం చోరీలు, 5 శాతం అత్యాచారం కేసులు పెరిగినట్లు సీపీ వెల్లడించారు. రూ.46 కోట్ల సొమ్ము చోరీ కాగా, అందులో రూ. 26.72 కోట్లు రికవరీ చేసినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే ట్రాఫిక్ చలానాల ద్వారా రూ.34 కోట్లు వసూలు అయినట్లు వెల్లడించారు. పోలీస్ వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేశామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement