10వేలమంది పోలీసులతో బందోబస్తు: సీపీ | City police Commissioner mahendar reddy o Ramzan wishes and arrangements | Sakshi
Sakshi News home page

10వేలమంది పోలీసులతో బందోబస్తు: సీపీ

Published Thu, Jul 7 2016 10:15 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

City police Commissioner mahendar reddy o Ramzan wishes and arrangements

హైదరాబాద్ : రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మీర్ ఆలం దర్గాలో లక్షమందిపైగా ప్రార్థనలకు వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. నగరంలో దాదాపు 20చోట్ల పెద్దసంఖ్యలో ప్రార్థనలు జరుగుతున్నాయన్నారు.

బందోబస్తుకు 10వేలమంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. అలాగే ప్రత్యేకంగా సీసీ టీవీలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక రంజాన్ సందర్భంగా ఈద్గాలకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు.  ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలోనే బోనాలు కూడా జరుగుతున్న నేపథ్యంలోను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement