అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. దశాబ్దాల కల సాకారం అంటూ హిందువులు పులకించిపోతున్నారు. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ రామాలయం నిర్మాణం కోసం ఐదు కోట్ల రూపాయలను ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రామ మందిర ట్రస్టుకు డబ్బులు ఇవ్వనున్నాడంటూ ఫేస్‌బుక్‌లో వరుస పోస్టులతో ఊదరగొడుతున్నారు. షారుక్ ఖాన్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సీనియర్ మేనేజర్ ఈ విషయాన్ని వెల్లడించారంటూ ఓ గ్రాఫిక్ చిత్రం వైరల్ అవుతోంది. (కరోనా రాకుండా బంగ్లాను కప్పేసిన హీరో?)
దీన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అసత్యవార్తగా కొట్టిపారేసింది. అలాగే దైనిక్ భాస్కర్ మీడియాలో షారుక్ విరాళం ఇచ్చినట్లుగా కనిపిస్తోన్న వార్త నిజం కాదని, కావాలని ఎడిటింగ్ చేసి ప్రచారం చేశారని రుజువైంది. నిజానికి ఏ వార్తా పత్రికలోనూ, న్యూస్ ఛానల్‌లోనూ షారుక్ విరాళం ఇచ్చినట్లు ఎక్కడా వార్తలు రాలేదు. గతంలో షారుక్ కరోనా నుంచి కాపాడుకునేందుకు తన భవనాన్ని పూర్తిగా కప్పివేశారంటూ ప్రచారం జరిగింది. అయితే అది ముంబైలోని భారీ వర్షాల కారణంగా ప్రతి ఏడాది తన నివాసాన్ని అలాగే కప్పివేస్తాడని తెలిసింది. (రాముడు అందరి వాడు : ప్రధాని మోదీ)
నిజం: అయోధ్యలో రామ మందిరం కోసం షారుక్ ఖాన్ ఎలాంటి విరాళం ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment