సుదృఢ నిర్మాణం... సుందర రూపం.. రామాలయం! | Shri Ram Janmabhoomi Mandir Is Built To Last 1000 Years, Says Land T - Sakshi
Sakshi News home page

Shri Ram Janmabhoomi Mandir సుదృఢ నిర్మాణం... సుందర రూపం.. రామాలయం!

Published Mon, Jan 22 2024 10:33 AM | Last Updated on Mon, Jan 22 2024 1:04 PM

Shri Ram Janmabhoomi Mandir built to last 1000 years says Land T - Sakshi

#ShriRamJanmabhoomiMandir అయోధ్య  శ్రీరాముని ప్రాణప్రతిష్ట వైభవానికి సర్వం సిద్ధమైంది. ఈ అంగరంగ వైభవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.  ఈ వేడుకను  కనులారా తిలకించేందుకు అతిరథ మహారథులు,  దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు, మూవీ రంగ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు అంతా ఇప్పటికే అయోధ్యా నగరానికి చేరుకున్నారు.  మరోవైపు శ్రీరామ జన్మభూమి మందిర్‌ను వెయ్యి సంవత్సరాలు  చెక్కుచెదరకుండా ఉండేలా  నిర్మించామని ప్రముఖ నిర్మాణ  సంస్థ  లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది.

70 ఎకరాల విస్తీర్ణంలో ,  161.75 అడుగుల ఎత్తు, 380 అడుగుల పొడవు , 249.5 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉన్న ఆ ఆలయ సముదాయం  కలిగి ఉంది. డిజైన్ ఐదవ శతాబ్దంలో దాని మూలాలున్న నాగారా నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు. ఈ ఆలయంలో  ప్రధాన శిఖరంతో పాటు మూడు అంతస్తులు, నృత్య మండప్, రంగ్ మండప్, గూఢ్ మండప్, కీర్తన మండప్ , ప్రార్థనా మండప్ అనే  ఐదు మండపాలు ఉన్నాయి. దీని తయారీకి రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా నుంచి గులాబీ రంగు బన్సీ పహార్‌పూర్ రాళ్లను కొనుగోలు చేశారు.అంతేకాదు భారీ భూకంపాలను (జోన్ 4)  సైతం తట్టుకునేలా రూపొందించింది. ఆలయానికి ఇరువైపులా 390 స్తంభాలు, 6 మక్రానా పాలరాతి స్తంభాలు ఉన్నాయి. వాటిలో 10 వేలకు పైగా శిల్పాలు, ఇతివృత్తాలు  భక్తులను అబ్బురపరుస్తాయి. 

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మే 2020 నుండి, దాదాపు మూడేళ్లలో కాంప్లెక్స్‌ను డిజైన్ చేసి నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయానికి 1000 సంవత్సరాల వరకు ఎలాంటి నష్టం జరగదని ఎల్ అండ్ టీ తెలిపింది. దాదాపు 1,500 మంది కళాకారుల బృందం రాళ్లపై క్లిష్టమైన శిల్పాలను తయారుచేశారని, QR కోడ్‌లతో 26,500 వ్యక్తిగత రాళ్లను పర్యవేక్షించడానికి స్టోన్ ట్రాకింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. వెయ్యేళ్ల పాటు వెలుగొందేలా, ఓర్పుకు చిహ్నంగా ఈ ఇంజినీరింగ్ అద్భుతం నిలుస్తుందని కంపెనీ  ఛైర్మన్ , ఎండీ సుబ్రహ్మణ్యన్ అన్నారు. దీని పునాదికి ఐఐటీ సంస్థల సహాయం కూడా తీసుకున్నామని చెప్పారు. ఈ ఆలయంలోని ప్రతి రాయిని ఎంతో శ్రద్ధగా, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిష్ఠించామని ఎల్‌అండ్‌ టీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంవీ సతీష్‌ వెల్లడించారు. దీన్ని ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా, అద్భుత ఇంజనీరింగ్ కళాఖండమని, ఇది తమ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement