Engineeing
-
సుదృఢ నిర్మాణం... సుందర రూపం.. రామాలయం!
#ShriRamJanmabhoomiMandir అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట వైభవానికి సర్వం సిద్ధమైంది. ఈ అంగరంగ వైభవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకను కనులారా తిలకించేందుకు అతిరథ మహారథులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు, మూవీ రంగ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు అంతా ఇప్పటికే అయోధ్యా నగరానికి చేరుకున్నారు. మరోవైపు శ్రీరామ జన్మభూమి మందిర్‌ను వెయ్యి సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించామని ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. 70 ఎకరాల విస్తీర్ణంలో , 161.75 అడుగుల ఎత్తు, 380 అడుగుల పొడవు , 249.5 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉన్న ఆ ఆలయ సముదాయం కలిగి ఉంది. డిజైన్ ఐదవ శతాబ్దంలో దాని మూలాలున్న నాగారా నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన శిఖరంతో పాటు మూడు అంతస్తులు, నృత్య మండప్, రంగ్ మండప్, గూఢ్ మండప్, కీర్తన మండప్ , ప్రార్థనా మండప్ అనే ఐదు మండపాలు ఉన్నాయి. దీని తయారీకి రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లా నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ రాళ్లను కొనుగోలు చేశారు.అంతేకాదు భారీ భూకంపాలను (జోన్ 4) సైతం తట్టుకునేలా రూపొందించింది. ఆలయానికి ఇరువైపులా 390 స్తంభాలు, 6 మక్రానా పాలరాతి స్తంభాలు ఉన్నాయి. వాటిలో 10 వేలకు పైగా శిల్పాలు, ఇతివృత్తాలు భక్తులను అబ్బురపరుస్తాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మే 2020 నుండి, దాదాపు మూడేళ్లలో కాంప్లెక్స్‌ను డిజైన్ చేసి నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయానికి 1000 సంవత్సరాల వరకు ఎలాంటి నష్టం జరగదని ఎల్ అండ్ టీ తెలిపింది. దాదాపు 1,500 మంది కళాకారుల బృందం రాళ్లపై క్లిష్టమైన శిల్పాలను తయారుచేశారని, QR కోడ్లతో 26,500 వ్యక్తిగత రాళ్లను పర్యవేక్షించడానికి స్టోన్ ట్రాకింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. వెయ్యేళ్ల పాటు వెలుగొందేలా, ఓర్పుకు చిహ్నంగా ఈ ఇంజినీరింగ్ అద్భుతం నిలుస్తుందని కంపెనీ ఛైర్మన్ , ఎండీ సుబ్రహ్మణ్యన్ అన్నారు. దీని పునాదికి ఐఐటీ సంస్థల సహాయం కూడా తీసుకున్నామని చెప్పారు. ఈ ఆలయంలోని ప్రతి రాయిని ఎంతో శ్రద్ధగా, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిష్ఠించామని ఎల్అండ్ టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ సతీష్ వెల్లడించారు. దీన్ని ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా, అద్భుత ఇంజనీరింగ్ కళాఖండమని, ఇది తమ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 -
2012లో ఇంజినీరింగ్ .. 2023లో ఎంబీబీఎస్.. తీరని కల నెరవేరుతోందిలా..
ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఒక విద్యార్థి మెడికల్ కోర్సు చేసేందుకు జార్ఖండ్‌లోని ధన్బాద్లో గల షహీద్ నిర్మల మెహతో మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. విద్యార్థి చందన్ కుమార్ ఎడ్మిషన్ ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఎంబీబీఎస్‌లో చేరడమనేది ఈ కాలేజీలో ఇదే మెదటిసారి. చందన్ ఎంబీబీఎస్ చేసేందుకు రూ.18 లక్షల శాలరీ ప్యాకేజీని కూడా వదులుకోవడం విశేషం. ఎన్ఐసీ వరంగల్‌లో ఇంజినీరింగ్ పూర్తి చందన్ కుమార్ తల్లి ఐఐటీ ఐఎస్‌ఎంలో డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్ తీసుకునేందుకు వచ్చిన చందన్ మాట్లాడుతూ వైద్యుడు కావాలన్నది తన చిరకాల స్వప్నం అని అన్నారు. ఐఎస్ఎం ఎనెక్సీ నుంచి 2008లో ప్లస్ టూ పూర్తి చేసిన అనంతరం చందన్ అటు మెడికల్, ఇటు ఇంజినీరింగ్ రెండింటిలో ఎడ్మిషన్ కోసం ప్రయత్నించాడు. అయితే మెడికల్‌లో అతనికి సీటు లభ్యం కాలేదు. దీంతో ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. ఎన్ఐసీ వరంగల్(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో బయోటెక్నాలజీలో 2012లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తరువాత ఉద్యోగంలో చేరాడు. ప్రత్యేక శిక్షణ లేకుండానే.. అయితే ఎంబీబీఎస్ చేయాలన్న కల అతన్ని నిద్రపోనివ్వలేదు. దీంతో 2015లో మెడికల్ ఎంట్రన్స్ రాసి విజయం సాధించాడు. అయితే తగిన ర్యాంకు రాకపోవడంతో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ దొరకలేదు. అయితే ఈసారి మెడికల్ ఎంట్రన్స్‌లో 2,650వ ర్యాంకు దక్కించుకున్నాడు. దీంతో ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మెడికల్‌లో సీటు కోసం తాను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని, తాను గతంలో 12వ తరగతిలో చదుకున్న దానినే తిరిగి అధ్యయనం చేశానన్నారు. భార్య ఎస్బీఐలో మేనేజర్ ఏఎన్‌ఎంఎంసీహెచ్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ పూర్తి చేశాక డాక్టర్ కావాలనుకోవడం గొప్ప విషయం అని అన్నారు. తమ కాలేజీలో ఈ విధమైన అడ్మిషన్లలో ఇది మొదటిదని అన్నారు. చందన్ కుమార్ భార్య అపర్ణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే చందన్ సోదరి గౌరి కుమారి బీహార్ విద్యాశాఖలో పనిచేస్తున్నారు. మరో సోదరి ఎంఏ చేస్తున్నారు. ఆమెకు కూడా వివాహం అయ్యింది. ఇది కూడా చదవండి: ‘ఇండియా జేమ్స్ బాండ్’ సౌదీలో ఏం చేస్తున్నారు? -
అక్రమార్జనలో ‘రాజు’
సాక్షి, అమరావతి/చిత్తూరు (కార్పొరేషన్)/విశాఖ దక్షిణం/శ్రీకాకుళం క్రైమ్/పార్వతీపురం టౌన్: అవినీతి నిరోధక శాఖ వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో సోమవారం ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు, మరో దేవదాయ శాఖ ఉద్యోగి పట్టుబడ్డారు. ఇందులో ఆదాయానికి మించి ఆస్తుల్ని కలిగి ఉన్న ఇద్దరితోపాటు లంచం తీసుకుంటుండగా ఒకరు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినట్టు ఏసీబీ డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రుద్రరాజు రవిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇందులో ఆదాయానికి మించి భారీగా ఆస్తులను గుర్తించారు. రూ.39.40 లక్షల నగదు, 3.87 కిలోల వెండి, బంగారం, వజ్రాలతోపాటు భవనాలు, ఖరీదైన కార్లు ఉన్నట్టు తేల్చారు. వీటితోపాటు భార్య, కుమార్తె, మరో వ్యక్తి పేరుపై లాకర్లు ఉన్నాయని, ఇంకా సోదాలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. పార్వతీపురం ఏఈఈ తక్కువ తినలేదు పార్వతీపురం సబ్ డివిజన్ పంచాయతీరాజ్ విజిలెన్స్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వీరమాచినేని సుధాకర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం, విజయవా డలో రెండు ఫ్లాట్లు, విజయనగరం, విజయవాడలో మూడు ఖాళీ స్థలాలు, కృష్ణా జిల్లాలో ఆరుచోట్ల 8.06 ఎకరాల వ్యవసాయ భూమి, 719.33 గ్రాముల బంగారు నగలు, 2.39 కేజీల వెండి వస్తువులు, రూ.78,392 నగదు, బ్యాంకుల్లో రూ.20,30,552 డిపాజిట్లతో పాటు అత్తగారింట్లో నాలుగు లాకర్ల తాళాలను గుర్తించారు. పట్టుబడిన లంచగొండి గుంటూరులో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ (సీనియర్ అసిస్టెంట్)గా విధులు నిర్వహిస్తున్న మీనా వెంకటేశ్వరరావు న్యాయస్థానంలో ఉన్న ఓ కేసు విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల లంచం డిమాండ్ చేసి రూ.5 వేలు తీసుకున్నారు. మరో రూ.5 వేలు ఇస్తేనే కౌంటర్ దాఖలు చేస్తానని బాధితుడిని ఇబ్బంది పెట్టడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం మీనా వెంకటేశ్వరరావు బాధితుడి నుంచి మరో రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేసినట్టు డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డి వివరించారు. (చదవండి: దేవతల్లా యజ్ఞం చేస్తున్నాం.. రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు) -
ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్లో బాలికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో వీటిని విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో బాలురు ఎక్కువ శాతం అర్హత సాధిస్తే, మెడికల్.. అగ్రికల్చర్ విభాగంలో బాలికలు ఎక్కువ మంది అర్హత పొందారు. ర్యాంకులు, మార్కులతో కూడిన ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌కు మొత్తం 1,72,238 మంది దరఖాస్తు చేశారు. 1,56,860 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది (80.41 శాతం) అర్హత సాధించారు. బాలురు 75,842 మంది అర్హత పొందితే, బాలికలు 50,298 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్..మెడికల్ ఎంసెట్‌కు 94,476 మంది దరఖాస్తు చేస్తే 80,575 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 71,180 మంది (88.34 శాతం) అర్హత సాధించారు. బాలురు 21,329 మంది, బాలికలు 49,851 మంది అర్హత పొందారు. ఏపీ విద్యార్థులకు అగ్రశ్రేణి ర్యాంకులు తెలంగాణ ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు అగ్రశ్రేణి ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్, మెడికల్..అగ్రికల్చర్ విభాగాలు రెండిటిలోనూ నంబర్ వన్ ర్యాంకులు వారికే దక్కాయి. అంతేకాదు టాప్టెన్లోనూ ఎక్కువమంది ఏపీ విద్యార్థులే ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎనిమిది మంది, అగ్రికల్చర్..మెడికల్ విభాగంలో ఏడుగురు ఉన్నారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ఇద్దరు, మెడికల్..అగ్రికల్చర్ విభాగంలో ముగ్గురు మొదటి పది ర్యాంకుల్లో ఉన్నారు. ఫలితాలు విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాస్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎ.గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందనలు: సబిత వర్షాలు, వరదల్లోనూ ఎంసెట్ నిర్వహించిన పలు ప్రభుత్వ విభాగాలకు విద్యా మంత్రి సబితా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎంసెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈసెట్ ఫలితాలు విడుదల పాలిటెక్నిక్ పూర్తిచేసి, ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు నిర్వహించిన ఈసెట్ పరీక్ష ఫలితాలను కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ పరీక్షకు 24,055 మంది దరఖాస్తు చేస్తే, 22,001 మంది పరీక్ష రాశారు. వీరిలో 19,954 మంది (90.69 శాతం) అర్హత పొందారు. కుర్చా హేమంత్ (విశాఖ), జి సాయినాగరాజు (పశ్చిమగోదావరి), కె నర్సింహనాయుడు (విశాఖ), ఇండిగ ఆకాశ్ (విశాఖ), ఐతంశెట్టి జగన్ (అనకాపల్లి) మొదటి ఐదు ర్యాంకులు పొందారు. చదవండి: నెలనెలా కరెంట్ షాక్! -
ఏఐసీటీఈ పచ్చ జెండా.. భారీగా పెరగనున్న సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక ఉన్నత విద్యా మండలి (ఏఐసీటీఈ) తాజాగా పచ్చజెండా ఊపింది. ఫీజుల పెంపునకు సంబంధించి 2015లో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ)లను ఆదేశించింది. దీనితో విద్యార్థులపై ఫీజుల భారం పెరిగిపోనుంది. ఫీజులు పెంచాలన్న ఏఐసీటీఈ నిర్ణయంపై అంతటా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండింతలకుపైగా..: ఏఐసీటీఈ ఆదేశాల నేపథ్యంలో దాదాపు అన్ని సాంకేతిక, మేనేజ్మెంట్ కోర్సుల ఫీజులు రెండింతలకుపైగా పెరగనున్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్య మరింత భారం కానుంది. ఉదాహరణకు.. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సులకు కనిష్ట వార్షిక ఫీజు రూ.35 వేలుగా ఉండగా.. ఏఐసీటీఈ ఆదేశాలు అమలైతే ఏకంగా రూ. 67 వేలకు పెరగనుంది. గరిష్ట ఫీజు రూ.1.35 లక్షల నుంచి ఏకంగా రూ. 1.89 లక్షలకు చేరనుంది. పెంపుపై రాష్ట్ర ఎఫ్ఆర్సీ తర్జనభర్జన రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ కొద్దినెలలుగా కసరత్తు చేస్తోంది. 2019లో నిర్ధారించిన ఫీజులకు మరో 10 శాతం పెంచి ఆదేశాలు ఇస్తారని ఇప్పటిదాకా అంతా భావించారు. కానీ ఏఐసీటీఈ పిడుగులాంటి ఆదేశాలు జారీ చేయడంతో.. ఏం చేయాలన్న దానిపై ఎఫ్ఆర్సీ తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితుల్లో.. ఫీజుల పెంపు సమస్యగా మారుతుందేమోనని భావించిన ఎఫ్ఆర్సీ.. శనివారం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేసినట్టు సమాచారం. ఫీజులు పెంచితే ఉద్యమమే.. రెండేళ్లుగా కరోనాతో పేద, మధ్య తరగతి వర్గా లు ఆర్థికంగా చితికిపోయాయి. జీవనమే దుర్భరమైన కుటుంబాలూ ఉన్నా యి. బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఫీజు లు పెంచి పేదలకు ఉరి బిగించాలనే నిర్ణయం దారుణం. ఫీజులు పెంచితే ఉద్యమం తప్పదు. – నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పెంచాల్సిన అవసరమేంటి? అధ్యాపకులకు ఏడో వేతన ఒప్పందం అమలు చేస్తున్నామని ప్రైవేటు కాలేజీలు ఏఐసీటీఈని నమ్మించాయి. అందుకే శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇది ముమ్మాటికీ అన్యాయమే. అధ్యాపకులకు ఇప్పటికీ ఐదో వేతన ఒప్పందం మేర వేతనాలే అందడం లేదు. కరోనా సమయం నుంచి అధ్యాపకులకు జీతాలు ఇవ్వని కాలేజీలూ ఉన్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా ఫీజులు పెంచడం దారుణం. – సంతోష్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక కాలేజీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు -
Tamil Nadu: మాతృభాషలో ఇంజినీరింగ్ విద్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ విద్యలో తమిళ మీడియంను ప్రవేశపెట్టి పాఠ్యాంశాలను బోధించేందుకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతిచ్చింది. తమిళం సహా 8 మాతృభాషలో బోధనకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. జాతీయ విద్యావిధానంలోని కొన్ని అంశాలను పలువురు వ్యతిరేకించారు. అందులో మాతృభాషలో విద్యాబోధన జరగాలని కూడా ఉంది. మాతృభాషలో విద్యాబోధనను అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టడం ప్రారంభించింది. ఇంజినీరింగ్ విద్యను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో బోధించేందుకు కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఈ నేపథ్యంలో విధివిధానాల రూపకల్పన పనులను ఏఐసీటీఈ చేపట్టింది. మాతృభాషలో ఇంజినీరింగ్ విద్యా బోధన వల్ల గ్రామీణ, కొండప్రాంత హరిజన, గిరిజనుల కలలు నెరవేరుతాయని నమ్ముతున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, జపాన్, చైనా దేశాలు తమ మాతృభాషల్లోనే పూర్తిగా విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయి. అదే రీతిలో ఏఐసీటీఈ సైతం ఆంగ్ల భాషలోని పాఠాలను 22 భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు సమాయత్తమైంది. తమిళనాడుకు సంబంధించి ఇంజినీరింగ్ విద్యను విద్యార్థులు ఇంగ్లిష్ లేదా తమిళంలో అభ్యసించడంపై ఏఐసీటీఈ అభిప్రాయ సేకరణ చేపట్టింది. అందులో 42 శాతం మంది మాతృభాష తమిళంలోనే బోధనకు మద్దతు పలికారు. ఈ కారణంగా తమిళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తెలుగు, గుజరాతీ, కన్నడం, మలయాళం. ఈ 8 భాషల్లో ఇంజినీరింగ్ పాఠాలను తర్జుమా చేసేందుకు ఏఐసీటీఈ నిర్ణయించుకుంది. దీని గురించి ఏఐసీటీఈ అధ్యక్షుడు అనిల్ సహస్రబుదే మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను మాతృభాషలో బోధించేందుకు పలు మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. మాతృభాషలో పాఠ్యాంశాల బోధన వల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. తొలి దశలో 8 భాషల్లో సిలబస్‌ను తర్జుమా చేస్తున్నామని, గరిష్టంగా 142 పాఠ్యాంశాలు, తమిళంలో 94 పాఠ్యాంశాల సిలబస్‌ను తర్జుమా సాగుతోందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాతృభాషలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు ఏఐసీటీఈ అనుమతిచ్చిందన్నారు. తర్వాత మరో 11 భాషల్లోకి తర్జుమా చేస్తామని చెప్పారు. అన్నాయూనివర్సిటీ (చెన్నై) సహా అదే వర్సిటీకి చెందిన 12 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ తరగతులను 2010 నుంచి తమిళంలో నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. -
ఇంజనీరింగ్, ఫార్మసీ లకు ఆన్లైన్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో ఆన్లైన్ బోధనను ప్రారంభించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఆన్లైన్లో బోధన ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం పూర్తిస్థాయి షెడ్యూల్‌ను జారీ చేసింది. ఆన్లైన్ విద్యా బోధనతోపాటు పరీక్షలు, సెలవులు ఇతరత్రా అన్ని వివరాలను పొందుపరిచింది. -
ఎంబీఏ జాబ్రూటు ఇంజనీరింగ్ వెనకబాటు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏటా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్)లో ఎక్కువగా ఉండగా, ఉద్యోగానికి కావాల్సిన ప్రతిభా వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2019లోనూ ఇంజనీరింగ్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాల విషయంలో వారు వెనుకబడిపోయారు. 2019లో ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఎంబీఏ విద్యార్థుల్లో ఎక్కువగా ఉన్నట్లు ఇండియా స్కిల్ రిపోర్టు–2020లో వెల్లడైంది. 2019 జూలై నుంచి నవంబర్ వరకు నేషనల్ ఎంప్లాయిబిలిటీ టెస్టు సర్వేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో ది వీ బాక్స్ నిర్వహించింది. ఇండియా స్కిల్ రిపోర్టు–2020 పేరుతో ఆ నివేదికను విడుదల చేసింది. సంఖ్య పెరిగింది.. నైపుణ్యం తగ్గింది.. దేశంలోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3 లక్షల మంది విద్యార్థులను, వివిధ రంగాలకు చెందిన 150 కంపెనీలను కలసి చేసిన సర్వే నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. 2018లో ఉన్నత విద్యను చదివే విద్యార్థుల్లో బీఈ/బీటెక్ వారు 23 శాతం ఉన్నారు. మిగతా వారంతా ఇతర కోర్సుల్లో ఉన్నారు. 2019కి వచ్చే సరికి ఉన్నత విద్యను చదివే విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య 31 శాతానికి పెరిగింది. ఉద్యోగానికి కావాల్సి ప్రతిభ ఇంజనీరింగ్ చదివే వారిలో తక్కువ మందిలో ఉన్నట్లు తేలింది. 2018లో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 57.09% మందిలో ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నట్లు వెల్లడి కాగా, 2019లో మాత్రం ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న విద్యార్థుల సంఖ్య 49 శాతానికి పడిపోయింది. ఇక 2018 సంవత్సరంలో ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎంబీఏ విద్యార్థులు 13 శాతం ఉంటే, 2019లో వారి సంఖ్య 17 శాతానికి పెరిగింది. ఇక నైపుణ్యాల విషయానికి వస్తే 2018లో ఎంబీఏ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య 36.44%ఉండగా 2019లో ఎంబీఏ విద్యార్థుల్లో ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య 54 శాతానికి పెరిగినట్లు తేల్చింది. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో సమస్యలకు కారణాలివే
న్యూఢిల్లీ: నాణ్యమైన విద్య అందకపోవడం వల్లనే ఇంజనీరింగ్ కాలేజీల్లో అధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ముందస్తు ప్రణాళిక లేకుండా ఏఐసీటీఈ దరఖాస్తు చేసుకున్న వారికల్లా అనుమతి ఇవ్వడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. గత నాలుగేళ్లలో ఇలా అధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోయిన 100కు పైగా కాలేజీలను మూసివేశామన్నారు. కాలేజీల్లో సీట్లు మిగిలిపోవడం వల్ల దేశానికి ఎలాంటి సమస్య లేదన్నారు. విద్యార్థులంతా కాలేజీల్లో నాణ్యమైన విద్య, వసతులను బట్టి కాలేజీలను ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు. ఈ సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా రాష్ట్రాలతో సమన్వయమై సరైన ప్రణాళికలతోనే కొత్త కాలేజీలకు అనుమతిస్తున్నామని జవదేకర్ స్పష్టం చేశారు. కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ లేకనే విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు మొగ్గుచూపడం లేదన్న కాలేజీల వాదనను జవదేకర్ తప్పుబట్టారు. ఐఐటీల్లో చాలా ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నాయని, చాలా ఉద్యోగ అవకాశాలున్నాయి, కానీ నాణ్యమైన విద్యావంతులు అందుబాటులో ఉండటం లేదన్నారు. మార్కెట్ తగ్గట్టుగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోలేకపోతున్నారని చెప్పారు. దీనికి యూనివర్సిటీలు కూడా కారణమని, పాత సిలబస్‌తోనే కోర్సులను కొనసాగించడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడం కోసమే ప్రభుత్వం మెక్ ఇన్ ఇండియా కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇన్క్యూబేషన్ సెంటర్లలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణనిస్తున్నారని జవదేకర్ పేర్కొన్నారు. -
‘ఇంజనీరింగ్’కు తాళం
-
‘ఇంజనీరింగ్’కు తాళం
మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల కొరత కారణంగా వృత్తి విద్యా కోర్సులు వెలవెలబోతున్నాయి. ఇంజనీరింగ్ ఫార్మసీ వంటి కోర్సుల్లో ఏటా సగం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. అనుమతుల సమయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), అనుబంధ గుర్తింపు ఇచ్చేటప్పుడు యూనివర్సిటీలు పట్టించుకోని కారణంగా నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీల్లో సీట్లు కుప్పలుతెప్పలుగా పెరిగాయి. దీంతో మెరుగైన బోధన అందక విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయి. ఇంజనీరింగ్ చేసిన వారిలో 69 శాతం మందికి ఉపాధి దొరకడం లేదు. గత ఐదారేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రులు ఉపాధి అవకాశాలు కల్పించే కాలేజీలపైనే దృష్టి పెడుతున్నారు. ఆర్థికంగా కష్టమైనా ప్లేస్‌మెంట్స్ ఉన్న కాలేజీల్లో.. మేనేజ్మెంట్ కోటాలోనూ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఏటా ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిపోతోంది. – సాక్షి, హైదరాబాద్ దేశవ్యాప్తంగా సగం సీట్లే భర్తీ... 2016–17 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 6,472 ఇంజనీరింగ్ కాలేజీల్లో 29,98,298 సీట్లు అందుబాటులో ఉండగా అందులో 15,41,182 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే దాదాపు సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 268 ఇంజనీరింగ్ కాలేజీల్లో 2,30,552 సీట్లను ఏఐసీటీఈ మంజూరు చేయగా అందులో కేవలం 1,18,419 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక ఫార్మసీలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 2016–17 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మసీ కాలేజీల్లో 1,69,776 సీట్లు అందుబాటులో ఉండగా అందులో 1,09,741 సీట్లు భర్తీ అయ్యాయి. మన రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫార్మసీలో 25,757 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 10,391 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. గత నాలుగైదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. 64% నుంచి 50 శాతానికి పడిపోయిన ప్రవేశాలు... దేశంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు గత ఆరేళ్లలో దారుణంగా పడిపోయాయి. 2012–13 విద్యా సంవత్సరంలో 64.87 శాతంగా ఉన్న సీట్ల భర్తీ.. 2016–17 విద్యా సంవత్సరానికి 50.26 శాతానికి తగ్గిపోయింది. అలాగే రాష్ట్రంలో 2012–13లో 56.63 శాతంగా ఉన్న ప్రవేశాలు 2016–17లో 51.97 శాతానికి పడిపోయాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఫార్మసీ కాలేజీల్లో కేవలం 60 శాతం నుంచి 64 శాతం వరకే సీట్లు భర్తీ అవుతుండగా రాష్ట్రంలోని ఫార్మసీ కాలేజీల్లో 40 శాతం నుంచి 50 శాతం లోపే సీట్లు భర్తీ అవుతున్నాయి. గత ఐదేళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. 2012 నుంచి పరిస్థితి చూస్తే దేశవ్యాప్తంగా ఫార్మసీలో ప్రవేశాల శాతం క్రమంగా పెరుగుతుండగా మన రాష్ట్రంలో మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఆలస్యంగానైనా స్పందించిన ఏఐసీటీఈ... ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో నెలకొన్న పరిస్థితులకు నాణ్యతా ప్రమాణాల కొరతే ప్రధాన కారణమన్న అంశంపై ఏఐసీటీఈ ఎట్టకేలకు మేల్కొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యల్లో భాగంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను కట్టడి చేయడంపై దృష్టి సారించి ఐదేళ్లపాటు కొత్త కాలేజీలకు అనుమతులపై నిషేధం విధించాలని నిర్ణయించింది. 2019 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ఇటీవల ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశంలో స్పష్టం చేసింది. అలాగే 30 శాతం లోపు ప్రవేశాలున్న కాలేజీలను మూసివేయాలని నిర్ణయించింది. మూసివేతకు దరఖాస్తులు... విద్యార్థులు చేరకపోవడంతో ఏటా పదుల సంఖ్యలో ఫార్మసీ, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీలు మూత పడుతున్నాయి. 2012 నుంచి 2016 మధ్య 22 కాలేజీలు మూతపడగా 80 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేతకు దర ఖాస్తు చేసుకున్నాయి. 100 ఎంసీఏ కాలేజీలు, 200 మేనేజ్మెంట్ కాలేజీలూ మూసివేత కోసం ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో మూసివేతకు దరఖాస్తు చేసుకున్న వాటిల్లో 11 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇదీ ఫార్మసీలో సీట్ల భర్తీ పరిస్థితి... విద్యా సంవత్సరం దేశవ్యాప్తంగా.. రాష్ట్రంలో.. మొత్తం సీట్లు భర్తీ అయినవి మొత్తం సీట్లు భర్తీ అయినవి 2016–17 1,69,776 1,09,741 25,757 10,391 2015–16 1,73,837 1,04,818 29,750 11,832 2014–15 1,77,815 1,01,590 35,566 12,596 2013–14 1,69,665 98,318 32,780 15,219 2012–13 1,61,292 99,124 29,846 16,320 -
ట్రిపుల్ఈ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు
రామన్నపాలెం(కొడవలూరు) : ట్రిపుల్ ఈ బ్రాంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మెండుగా ఉద్యోగావకాశాలు లభ్యమవుతాయని ఏపీ ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ డాక్టర్ కె.శ్రీనివాస్ అన్నారు. రామన్నపాలెంలోని బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం ట్రిపుల్ ఈ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై మంగళవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తక్కువనే భావన ఉందన్నారు. దీనికి పక్కనపెట్టాలన్నారు. ప్రతి పరిశ్రమ విద్యాధారమైనందున ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రమేష్‌బాబు, ట్రì పుల్ ఈ హెచ్ఓడీ రత్నజ్వోతి, ఏఓ ఎస్.వేణుగోపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
9న ఎంసెట్ ర్యాంకుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకులను ఈనెల 9న సాయంత్రం 4:30 గంటలకు వెల్లడించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణరావు తెలిపారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఈ ర్యాంకుల వెల్లడి కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. మే 22న జరిగిన ఈ పరీక్ష రాసేందుకు 3,95,670 మంది దరఖాస్తు చేసుకోగా 3,73,286 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో 2,82,815 దరఖాస్తు చేసుకోగా 2,66,895 (94.37 శాతం) మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 1,12,855 మంది దరఖాస్తు చేసుకోగా 1,06,391 (94.27 శాతం) మంది పరీక్ష రాశారు. ఎంబీఏ, ఎంసీఏ ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను జేఎన్టీయూహెచ్ శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈశ్వర్ప్రసాద్ తెలిపారు.