ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఒక విద్యార్థి మెడికల్ కోర్సు చేసేందుకు జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో గల షహీద్ నిర్మల మెహతో మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. విద్యార్థి చందన్ కుమార్ ఎడ్మిషన్ ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఎంబీబీఎస్‌లో చేరడమనేది ఈ కాలేజీలో ఇదే మెదటిసారి. చందన్ ఎంబీబీఎస్ చేసేందుకు రూ.18 లక్షల శాలరీ ప్యాకేజీని కూడా వదులుకోవడం విశేషం.
ఎన్‌ఐసీ వరంగల్‌లో ఇంజినీరింగ్ పూర్తి
చందన్ కుమార్ తల్లి ఐఐటీ ఐఎస్‌ఎంలో డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్ తీసుకునేందుకు వచ్చిన చందన్ మాట్లాడుతూ వైద్యుడు కావాలన్నది తన చిరకాల స్వప్నం అని అన్నారు. ఐఎస్‌ఎం ఎనెక్సీ నుంచి 2008లో ప్లస్ టూ పూర్తి చేసిన అనంతరం చందన్ అటు మెడికల్, ఇటు ఇంజినీరింగ్ రెండింటిలో ఎడ్మిషన్ కోసం ప్రయత్నించాడు. అయితే మెడికల్‌లో అతనికి సీటు లభ్యం కాలేదు. దీంతో ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. ఎన్‌ఐసీ వరంగల్(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో బయోటెక్నాలజీలో 2012లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తరువాత ఉద్యోగంలో చేరాడు.
ప్రత్యేక శిక్షణ లేకుండానే..
అయితే ఎంబీబీఎస్ చేయాలన్న కల అతన్ని నిద్రపోనివ్వలేదు. దీంతో 2015లో మెడికల్ ఎంట్రన్స్ రాసి విజయం సాధించాడు. అయితే తగిన ర్యాంకు రాకపోవడంతో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ దొరకలేదు. అయితే ఈసారి మెడికల్ ఎంట్రన్స్‌లో 2,650వ ర్యాంకు దక్కించుకున్నాడు. దీంతో ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మెడికల్‌లో సీటు కోసం తాను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని, తాను గతంలో 12వ తరగతిలో చదుకున్న దానినే తిరిగి అధ్యయనం చేశానన్నారు.
భార్య ఎస్‌బీఐలో మేనేజర్
ఏఎన్‌ఎంఎంసీహెచ్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ పూర్తి చేశాక డాక్టర్ కావాలనుకోవడం గొప్ప విషయం అని అన్నారు. తమ కాలేజీలో ఈ విధమైన అడ్మిషన్లలో ఇది మొదటిదని అన్నారు. చందన్ కుమార్ భార్య అపర్ణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే చందన్ సోదరి గౌరి కుమారి బీహార్ విద్యాశాఖలో పనిచేస్తున్నారు. మరో సోదరి ఎంఏ చేస్తున్నారు. ఆమెకు కూడా వివాహం అయ్యింది.
ఇది కూడా చదవండి: ‘ఇండియా జేమ్స్ బాండ్’ సౌదీలో ఏం చేస్తున్నారు?
2012లో ఇంజినీరింగ్ .. 2023లో ఎంబీబీఎస్.. తీరని కల నెరవేరుతోందిలా..
Published Sun, Aug 6 2023 11:49 AM | Last Updated on Thu, Aug 10 2023 6:48 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment