సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో ఆన్‌లైన్ బోధనను ప్రారంభించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం పూర్తిస్థాయి షెడ్యూల్‌ను జారీ చేసింది. ఆన్‌లైన్ విద్యా బోధనతోపాటు పరీక్షలు, సెలవులు ఇతరత్రా అన్ని వివరాలను పొందుపరిచింది.
ఇంజనీరింగ్, ఫార్మసీ లకు ఆన్‌లైన్ తరగతులు
Published Tue, Nov 24 2020 9:07 AM | Last Updated on Tue, Nov 24 2020 9:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment