వీడియోలను విరివిగా చూడటం అనేది కోవిడ్ కాలం తర్వాత వేగంగా పెరిగింది. ఇంట్లోనే ఉండాల్సిన నాటి సమయంలో వినోదం కోసం వీడియోలను చూస్తూ టైమ్‌పాస్ చేశారు. వీడియోలపై ప్రేక్షకులకు పెరుగుతున్న క్రేజ్‌ను గమనించిన బడా టెలివిజన్ నెట్‌వర్క్‌లు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోకి ప్రవేశించాయి.
ఇప్పుడు ఓటీటీలకు ప్రత్యామ్నాయంగా పాడ్‌కాస్ట్‌ల ట్రెండ్ మరింతగా పెరుగుతోంది. పాడ్‌కాస్ట్..అంటే మోడ్రన్ రేడియో.. విద్య, వినోదం, వార్తలు, మత ప్రసంగాలు, నవలలు, మతపరమైన పుస్తకాలు, సాహిత్యం... ఇలా సమస్తం ఇప్పుడు ఆడియో రూపంలో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. యువత, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులలో పాడ్‌కాస్ట్‌పై విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది.
భారీ కోచింగ్ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలలు చదువును ఎలా సులభతరం చేయాలనే దానిపై దృష్టి సారిస్తున్నాయి. కోవిడ్ కాలంలో ఆన్‌లైన్ తరగతులు విరివిగా నిర్వహించేవారు. అయితే ఇప్పుడు పెద్దపెద్ద విద్యా కేంద్రాలు సిలబస్‌ను ఆడియో రూపంలో మార్చడానికి, విద్యార్థులకు సరళమైన భాషలో పాఠాలను బోధించేందుకు కృషి చేస్తున్నాయి.
ఆడియో బుక్‌కు సంబంధించిన మెటీరియల్‌ను వివిధ సబ్జెక్టుల నిపుణులు సరళమైన భాషలో సిద్ధం చేస్తున్నారు. వాటిని నిపుణుల సహకారంతో ఆడియో బుక్‌గా మార్చి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. మొబైల్‌లోని విద్యాసంబంధిత పాడ్‌కాస్ట్‌ను ఆన్ చేసి, చెవుల్లో ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని విద్యార్థులు సులభంగా వాటిని వినవచ్చు. అర్థం కాని సందర్భంలో మరోమారు వినేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది.
వినోదం కోసం ఇప్పుడు స్టోరీ పాడ్‌కాస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా వివిధ రకాల కథలను వినేందుకు అవకాశం ఏర్పడుతోంది. క్రైమ్, హర్రర్, కామెడీ ఇలా విభిన్న తరహాలలోని కథలు మనం వినవచ్చు. సెలబ్రిటీ వాయిస్‌లలో రికార్డ్ చేసిన పాడ్‌కాస్ట్‌లు, ఆడియో పుస్తకాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది.
ప్రేరణాత్మక ప్రసంగాలు మొదలుకొని మతపరమైన ప్రసంగాల వరకు సమస్తం పాడ్‌కాస్ట్ రూపంలో మన ముందుకు వచ్చాయి. వివిధ పాడ్‌కాస్ట్ యాప్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. పలువురు మోటివేషనల్ స్పీకర్లు తమ పాడ్‌కాస్ట్‌లను విడుదల చేస్తున్నారు.
ప్రపంచం, దేశం, రాష్ట్రం, స్థానిక వార్తలను అందించే పలు పాడ్‌కాస్ట్‌లు ఆదరణ పొందుతున్నాయి. న్యూస్ యాప్‌లలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రత్యేక పాడ్‌కాస్ట్ బులెటిన్‌లను చాలామంది క్రమం తప్పక వింటున్నారు. ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లలో షేర్ ట్రేడింగ్ మొదలుకొని ఉద్యోగంలో విజయం వరకు అనేక రకాల సమాచారం విశేష ఆదరణ పొందుతోంది.
ఇది కూడా చదవండి: ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే..
Comments
Please login to add a commentAdd a comment