భారత దేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టానికి సమయం అసన్నమైంది. అయోధ్య నగరంలోని భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు మరి కాసేపట్లో తెరలేవనుంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.
రామ జన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు ప్రముఖులు ఆయోద్యకు క్యూ కడుతున్నారు. దీంతో అయోధ్య పురి మొత్తం భక్తులతో నిండిపోయింది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Sachin Tendulkar reached Ayodhya#RamMandirPranPrathistha | #AyodhyaRamMandirpic.twitter.com/HuHQE9NxhR
— Don Cricket 🏏 (@doncricket_) January 22, 2024
వీరితో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా అయోధ్యకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా భారత స్టార్ ఆల్‌రౌండర్ ,రవీంద్ర జడేజా కూడా అయోధ్య పుర వీధుల్లో కన్పించాడు.. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Virat Kohli reaches Ayodhya for Ram Mandir Pran Pratishtha 🛕#ViratKohli #RamMandir #Ayodhya #CricketTwitter pic.twitter.com/k132x5UNv9
— InsideSport (@InsideSportIND) January 22, 2024
Comments
Please login to add a commentAdd a comment