అయోధ్య వాతావరణం.. ప్రత్యేక వెబ్‌పేజీ ప్రారంభించిన ఐఎండీ | Imd Creates Special Webpage For Ayodhya Weather | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: అయోధ్య కోసం వాతావరణ శాఖ ప్రత్యేక వెబ్‌ పేజీ

Published Thu, Jan 18 2024 3:25 PM | Last Updated on Sat, Jan 20 2024 5:13 PM

Imd Creates Special Webpage For Ayodhya Weather - Sakshi

అయోధ్య: శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరిగే ఈ నెల 22న అయోధ్యలో వాతావరణ వివరాలు తెలియజేసేందుకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఏకంగా ఒక ప్రత్యేక వెబ్‌పేజీని ప్రారంభించింది. ప్రాణప్రతిష్ట వేడుక జరిగే 22న అయోధ్యలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.7 డిగ్రీల సెల్సియస్‌, అత్యధిక ఉష్ణోగ్రత 22.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని ఐఎండీ తెలిపింది.

అయోధ్యలో 22వ తేదీన ఉండే ఉష్ణోగ్రతలతో పాటు తేమ, గాలి వేగం తదితర వాతావరణ సంబంధిత అంశాలను కూడా ఐఎండీ ఏర్పాటు చేసిన వెబ్‌పేజీ తెలియజేస్తోంది. 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు అయోధ్యలో ఉష్ణోగ్రతల ఫోర్‌క్యాస్ట్‌తో పాటు ఇక్కడ ఈ వారం రోజుల్లో ప్రతి రోజు ఏ సమయంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలవుతాయనే వివరాలను కూడా ఐఎండీ పొందుపరిచింది.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వివరాలన్నింటని హిందీ, ఆంగ్లం, ఉర్దూ, చైనీస్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ భాషల్లో ఐఎండీ అందుబాటులో ఉంచింది. కేవలం అయోధ్యనే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌, వారణాసి, లక్నోలతో పాటు రాజధాని న్యూ ఢిల్లీ నగరాల వాతావరణ వివరాలను కూడా ఐఎండీ వెబ్‌పేజీలో ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. పర్యాటకుల సౌకర్యార్థమే ఐఎండీ ప్రత్యేక వెబ్‌పేజీని రూపొందించినట్లు సమాచారం.  

ఇదీచదవండి.. రామాలయం పోస్టల్‌స్టాంపు విడుదల 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement