ఆధ్యాత్మిక పాత్రలను వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా రక్తి కట్టించినవాళ్లున్నారు. వెండితెర కంటే అద్భుతంగా సీరియల్స్ ద్వారా జనాలకు చేరువైన కథలున్నాయి. అలా ఎన్నో భక్తి ప్రధాన సీరియల్స్ ప్రేక్షకులను మైమరపింపజేశాయి. అందులో రామాయణ్ సీరియల్ ఒకటి. ఈ సీరియల్‌లో రాముడు, లక్ష్మణుడు, సీతగా నటించిన ముగ్గురికీ అయోధ్య రామాలయ ప్రారంభం కోసం ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే అయోధ్యను వీరు సందర్శించారు.
రాములవారికి ఎలాంటి పరిస్థితి?
శ్రీరాముని ఆలయాన్ని చూసి తన్మయత్వానికి లోనయ్యారు. రామాయణ్ సీరియల్‌లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహ్రి అయితే తనను తాను మైమరిచిపోయాడు. తాజాగా అతడు తన మనసులోని మాటలను మీడియాతో పంచుకున్నాడు. సునీల్ లహ్రి మాట్లాడుతూ.. 'అయోధ్యకు వెళ్లినప్పుడు నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఇక్కడే కదా రాములవారు పుట్టిపెరిగింది. కానీ ఆయనకు ఎలాంటి పరిస్థితి వచ్చింది. టెంట్ కింద విగ్రహాన్ని ఉంచారు.
వారి త్యాగం ఊరికే పోలేదు
అది చూసి నాకు ఎంతో బాధేసింది. మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అదే ప్రదేశంలో ఆయనకు గుడి కట్టినందుకు మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. 500 ఏళ్లుగా దీని కోసం పోరాడాం. ఎంతోమంది తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయలేదు. వారి త్యాగం ఊరికే పోలేదు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు (జనవరి 22) భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఫిబ్రవరిలోనే పెళ్లి!
Comments
Please login to add a commentAdd a comment