సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత సోనియాగాం«దీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అ«దీర్ రంజన్ చౌదరి నిర్ణయించుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఈ మేరకు వెల్లడించారు. కేవలం లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ, ఆరెసెŠస్‌స్ కలిసి రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని విమర్శించారు.
అందుకే అసంపూర్తి ఆలయాన్ని హడావుడిగా ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. ఖర్గే, సోనియా, అ«దీర్‌లను రామ మంది ట్రస్టు, వీహెచ్‌పీ నేతలు డిసెంబర్‌లో కలిసి రామ మందిర ప్రారం¿ోత్సవానికి రావాలంటూ వ్యక్తిగతంగా ఆహా్వన లేఖలు అందించారు. కానీ అది ఫక్తు ఆరెస్సెస్, బీజేపీ రాజకీయ సంరంభమని జైరాం విమర్శించారు. ‘‘కోట్లాది మంది భారతీయులు రాముడిని పూజిస్తారు. మతం మనిషి వ్యక్తిగత విషయం. అందుకే రామున్ని పూజించే కోట్లాది మంది సెంటిమెంట్లను గౌరవిస్తూనే ఆహా్వనాన్ని నేతలు సున్నితంగా తిరస్కరించారు’’ అన్నారు.
వారిని ప్రజలు బాయ్‌కాట్ చేస్తారు
కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీ దుయ్యబట్టింది. రాముని అస్తిత్వాన్నే నిరాకరిస్తున్నామంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పార్టీ నుంచి ఇంకేం ఆశించగలమని ఎద్దేవా చేసింది. హిందూ మతాన్ని, హిందువులను అవమానించడం కాంగ్రెస్‌కు, విపక్ష ఇండియా కూటమి పక్షాలకు కొత్తేమీ కాదంటూ మండిపడింది. రామునిపై నమ్మకం లేదని సోనియా మరోసారి నిరూపించుకున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శించారు. వారిని దేశ ప్రజలు బాయ్‌కాట్ చేస్తారని మరో మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment