లక్నో: అయోధ్య రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠ చేయనున్న బాలరాముని విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. విగ్రహం కళ్లపై గుడ్డతో కప్పబడి ఉంది. గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విషయం తెలిసిందే. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు.
బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే శుద్ధి కార్యక్రమాల కోసం రాముని పాదుకలను ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నిర్విఘ్నంగా క్రతువులు
ప్రత్యేక క్రతువులు నిరి్వఘ్నంగా కొనసాగుతున్నాయి. అయోధ్యలో మూడో రోజు గురువారం ఆచార్యులు ఆలయ ప్రాంగణంలో గణేశ్ పూజ, వరుణ పూజ, వాస్తు పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. జలదివస్‌లో భాగంగా రామ్‌లల్లా విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు. రాముడి విగ్రహాన్ని చెక్కిన మైసూరులో ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్ కుటుంబం స్వీట్లతో చేసిన రామమందిర ప్రతిరూపాన్ని తీసుకువచ్చింది.
ఇదీ చదవండి: గర్భగుడిలోకి రామ్‌లల్లా
Comments
Please login to add a commentAdd a comment