లక్నో: శ్రీరాముడు అనగానే గుర్తొచ్చే రూపం విల్లు బాణం ధరించిన నిండైన విగ్రహం. ఈ నెల 22న అయోధ్యలోని భవ్య మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగనుంది. ఆలయంలో కొలువుదీరే రామయ్యకు బహూకరించడానికి తమిళనాడు రాజధాని చెన్నైలో విల్లు, బాణాలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన విగ్రహానికి ఈ విల్లు, బాణాలు అలంకరిస్తారు. 2.5 కిలోల బరువైన ఈ విల్లు తయారీకి ఇతర లోహాలతోపాటు దాదాపు 700 గ్రాముల 23 క్యారెట్ బంగారం ఉపయోగిస్తున్నట్లు అయోధ్యలోని అమావా రామ మందిర్ ట్రస్టీ శయన్ కునాల్ చెప్పారు.
వాల్మీకి రామాయణంలో వర్ణించినట్లుగానే విల్లుతోపాటు బాణాలు తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. రాముడు ఉపయోగించిన వేర్వేరు బాణాల వర్ణన వాల్మీకి రామాయణంలో ఉందన్నారు. చెన్నైలో సిద్ధమవుతున్న విల్లు, బాణాలు త్వరలో అయోధ్యకు చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈ నెల 19న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు వీటిని అందజేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment