రాజ్యాంగ నిర్మాతలకు శ్రీరాముడే స్ఫూర్తి | PM Narendra Modi 109th Edition of Mann Ki Baat | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ నిర్మాతలకు శ్రీరాముడే స్ఫూర్తి

Published Mon, Jan 29 2024 5:48 AM | Last Updated on Mon, Jan 29 2024 5:48 AM

PM Narendra Modi 109th Edition of Mann Ki Baat - Sakshi

న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిందని, ఆ మహత్తర సందర్భం దేశ సమష్టి బలాన్ని చాటిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఏడాదిలో మొదటిసారిగా ఆదివారం ప్రసారమైన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాతలకు ఆ శ్రీరాముడే ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు.

అందుకే జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగిన ఉత్సవాన్ని ‘దేవుడు దేశానికి, రాముడు రాజ్యానికి’వచ్చిన సందర్భంగా పేర్కొంటున్నట్లు చెప్పారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి కోట్లాది మంది ప్రజలు కూడా ఇదేవిధంగా భావించారన్నారు. ‘ప్రతి ఒక్కరూ ఆ రోజు రామ భజన గీతాలు ఆలపించి ఆ రామునికే అంకితమిచ్చారు. రామ జ్యోతిని వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. ప్రతి ఒక్కరి మాటల్లోనూ, ప్రతి ఒక్కరి గుండెల్లోనూ రాముడే నిండిపోయాడు’అని ప్రధాని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement