సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతా ఉత్కంఠ ఎదురుచూస్తున్న రామమందిర భూమిపూజ కార్యక్రమానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాభవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈనెల 5న రామమందిరానికి శంకుస్థాపన జరుగునుంది. దీని కోసం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అయితే దాదాపు 28 ఏళ్ల అనంతరం నరేంద్ర మోదీ అయోధ్యకు రావడం గమనార్హం. 1992లో అయోధ్య రామాలయం నిర్మించాలని, కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ నరేంద్ర మోదీ తిరంగా యాత్రను చేపట్టారు. దీనిలో భాగంగానే అదే ఏడాది జనవరిలో తొలిసారి అయోధ్యకు చేరుకున్నారు. (రామాలయ పూజకు రాజకీయ రంగు)
ఆయనతో పాటు అప్పటి ఉత్తర ప్రదేశ్ బీజేపీ చీప్ మురళీమనోహర్ జోషీ, పలువురు పార్టీ సీనియర్లు మోదీ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా అయోధ్యను సందర్శించిన మోదీ.. మరోసారి ఇక్కడికి వస్తే అది మందిర నిర్మాణం జరిగాకే వస్తానంటూ శపథం చేశారు. ఈ విషయాన్ని ఆనాడు మోదీ వెంట ఉన్న ఓ నాయకుడు చెప్పారు. సరిగ్గా 28 ఏళ్ల తరువాత అయోధ్య వివాదం సమసిపోవడంతో ప్రధానమంత్రి హోదాలో మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. మోదీ ఆనాటి పర్యటన సంబందించిన ఫోటోసైతం బయయపడింది. కాగా మోదీ హయాంలోనే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు)
మోదీ శపథం.. 28 ఏళ్ల తరువాత తొలిసారి
Published Sat, Aug 1 2020 8:13 PM | Last Updated on Sat, Aug 1 2020 8:26 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment