బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని జీవీపీఆర్ ఇంజనీర్స్ సంస్థ అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.1.30 కోట్లు విరాళంగా అందజేసింది. ఈ మొత్తాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రకు చెక్కుల రూపంలో రెండు విడతలుగా అందజేశారు.
ఈ మేరకు జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఫౌండర్ చైర్మన్ వీరారెడ్డికి అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి రావలసిందిగా ప్రత్యేక ఆహ్వానం అందడంతో ఆ సంస్థ చైర్మన్ శివశంకర్‌రెడ్డి, తన కుటుంబంతో కలిసి ఆయన ఈ వేడుకలో సోమవారం పాల్గొన్నారు. శ్రీరాముడి పూజల్లో కూడా ఆయన పాలుపంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment