
రాజ్‌తరుణ్‌పై న్యాయపోరాటం చేస్తా
మణికొండ: తాను ఉంటున్న ఇంటిని లాక్కునేందుకు సినీహీరో రాజ్‌తరుణ్ అతని తల్లితండ్రులను పంపి డ్రామాలు చేస్తున్నాడని, అతని అనుచరులతో తనపై దాడి చేయించాడని, అతడిపై న్యాయ పోరాటం చేస్తానని అతని మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు. కోకాపేటలోని రాజ్‌తరుణ్ విల్లాకు బుధవారం అతని తల్లితండ్రులు రాజేశ్వరి, బసవరాజు తాము ఇక్కడే ఉంటామని రాగా, వారిని ఇంట్లోకి రానివ్వకుండా లావణ్య అడ్డుకున్న విషయం తెలిసిందే. వారు అర్దరాత్రి వరకు విల్లా ముందే కూర్చోవటంతో నార్సింగి పోలీసులు జోక్యం చేసుకుని వారిని ఇంట్లోకి పంపించారు. దీంతో గురువారం ఆమె రాజ్‌తరుణ్ తరఫు వ్యక్తులు 15 మంది తనపై దాడి చేశారని, వారి వెనక అతనే ఉన్నాడా.. మస్తాన్ సాయి ఉన్నాడా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు రాజ్‌తరుణ్‌తో ప్రాణహాని ఉందని, ఇప్పటి వరకు కలిసి పోదామని మిన్నకున్నానని, బుధవారం జరిగిన దాడితో అతనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. బెయిల్‌పై ఉన్న వ్యక్తి తనపై దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించింది. మస్తాన్‌సాయిని పంపినట్లు రాజ్‌తరుణ్‌ను కూడా జైలుకు పంపుతానన్నారు. కాగా రాజ్‌తరుణ్ తల్లి తండ్రులు విల్లాలోని రెండవ అంతస్తులో ఉండగా లావణ్య మొదటి అంతస్తులో ఉంటున్నట్లు తెలిపారు.
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
భవనం పైనుంచి దూకి ప్రియురాలి ఆత్మహత్య
గచ్చిబౌలి: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారానగర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాములు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రం, బస్కంది గ్రామానికి చెందిన సుల్తానా బేగం(26) సిద్ధిఖీనగర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని అంతేరా హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తోంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైదుల్లా షేక్ గచ్చిబౌలిలోని నావాబ్ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తూనే పెస్ట్ కంట్రోల్ పని చేసేవాడు. సుల్తానా, సైదుల్లా షేక్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుల్తానా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సుల్తానా సైదుల్లాపై ఒత్తిడి పెంచింది. బుధవారం సాయత్రం పెళ్లి విషయమై గొడవ జరిగింది. దీంతో పెళ్లికి నిరాకరించిన అతను ఆమె ఫోన్‌ను బ్లాక్‌లో పెట్టాడు. దీంతో సుల్తానా మరో యువతికి ఫోన్ చేసి షైదుల్లా ఉంటున్న ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె ఈ విషయాన్ని సైదుల్లాకు చెప్పినా అతను పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి లోనైన సుల్తానా గురువారం ఉదయం సైదుల్లా నివాసం ఉండే భవనంపైకి ఎక్కి 6వ అంతస్తు నుంచి దూకడంతో కింద పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా ఉదయం మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
● నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు
● నాపై 15 మంది దాడి చేశారు
ప్రాణహాని ఉంది
● రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య

రాజ్‌తరుణ్‌పై న్యాయపోరాటం చేస్తా