లక్నో: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమంలో రాముని విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పవిత్రతను కాపాడే ప్రయత్నంలో ఛత్తీస్‌గఢ్, అసోం, ఉత్తరప్రదేశ్‌లో జనవరి 22న "డ్రై డే"గా ప్రకటించాయి.
"డ్రై డే" అంటే మద్య పానీయాల అమ్మకాలు అనుమతించబడని రోజు. మద్యం దుకాణాలు మినహా, పబ్బులు, రెస్టారెంట్లు కూడా మద్య పానీయాలను విక్రయించబోరు. జనవరి 22ను జాతీయ పండుగలా జరుపుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు జనవరి 22న ఇప్పటికే సెలవు ప్రకటించారు. న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ నుండి రామమందిరం ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని వేలాది దేవాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా ఉండనున్నట్లు చెప్పడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. రామాలయాన్ని బీజేపీ ఎన్నికల లబ్ది కోసం చేపడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తోందని విమర్శిస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉండటంపై బీజేపీ మండిపడింది. రాముని అస్తిత్వాన్నే నిరాకరిస్తున్నామని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నుంచి ఇంకేం ఆశించగలమని దుయ్యబట్టింది.
ఇదీ చదవండి: Ram Mandir: రాములోరికి 44 క్వింటాళ్ల లడ్డూల భోగం
Comments
Please login to add a commentAdd a comment