
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అయోధ్య రామాలయంలో రాముని ప్రాణప్రతిష్టను పురస్కరించుకుని దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. అందులో పలు రైళ్లను ఉమ్మడి జిల్లా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు ప్రత్యేక రైళ్లు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల మీదుగా అయోధ్య వెళ్లనున్నాయి. ఒకటి మహారాష్ట్ర నుంచి నిజామాబాద్–కరీంనగర్–పెద్దపల్లి ప్రాంతాల మీదుగా అయోధ్యకు వెళ్తుంది. మరో రెండు రైళ్లలో ఒకటి సికింద్రాబాద్, మరోటి ఖాజీపేట నుంచి బయలుదేరి పెద్దపల్లి, రామగుండం మీదుగా అయోధ్య నగరాన్ని చేరుకుంటాయి. ఈనెల 29 నుంచి బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటనకు ఉద్దేశించిన ఈ ప్రత్యేక రైళ్లను ఆస్తా రైళ్లుగా పిలుస్తారు. ఇందులో 22 కోచ్‌లు ఉండగా 20 స్లీపర్ బోగీలు(రిజర్వుడు) రెండు మాత్రం సాధారణ బోగీలు ఉంటాయి.
జగిత్యాల–కరీంనగర్– పెద్దపల్లి మీదుగా
రైలు నంబర్.. 07649 జాల్నా నుంచి ఫిబ్రవరి 4న(ఆదివారం) ఉదయం 9:30 గంటలకు జాల్నా రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి కోరుట్ల సాయంత్రం 5:18 గంటలకు, లింగంపేట్ జగిత్యాల సాయంత్రం 5:50, కరీంనగర్ రైల్వేస్టేషన్ సాయంత్రం 6:45, పెద్దపల్లి జంక్షన్‌కు రాత్రి 7:35, రామగుండంకు రాత్రి 8:00, అయోధ్య మంగళవారం తెల్లవారుజామున 3:35 గంటలకు చేరుకుంటుంది.
ఇదే రైలు తిరుగుప్రయాణంలో నంబర్.. 07650 ఫిబ్రవరి 6న బుధవారం మధ్యాహ్నం 2:20 గంటలకు అయోధ్య ధామ్ జంక్షన్ నుంచి బయలుదేరి రామగుండానికి గురువారం సాయంత్రం 7:25 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కు 7:55, కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు రాత్రి 8:35, లింగంపేట జగిత్యాల రైల్వేస్టేషన్‌కు 9:20, కోరుట్ల రైల్వేస్టేషన్‌కు రాత్రి 9:50 గంటలకు చేరుకుంటుంది.
సికింద్రాబాద్ నుంచి..
రైలు నంబర్.. 07221 సికింద్రాబాద్ నుంచి అయోధ్య ధాం జంక్షన్ రైల్వేస్టేషన్‌కు ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు వారంలో మూడు రోజులు (మొత్తం 16 ట్రిప్పులు) ఈ రైళ్లు నడుస్తాయి, జనవరి 29, 31 తేదీలు, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీలలో సాయంత్రం 4:45 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్‌లో బయలుదేరుతుంది. కాజీపేట జంక్షన్‌కు సాయంత్రం 6:20 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కు 7:38, రామగుండం 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు(ఒక రోజు ప్రయాణం తర్వాత) ఉదయం 3:30 గంటలకు అయోధ్య చేరుకుంటాయి.
ఇదే రైలు తిరుగు ప్రయాణంలో నంబర్.. 07222తో ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 ఇంకా మార్చి 1, 3 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి, ఈ రైలు అయోధ్య ధామ్ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. ఈ రైళ్లు రామగుండంకు సాయంత్రం 6:30, పెద్దపల్లి జంక్షన్‌కు 7:00, కాజీపేట జంక్షన్‌కు 8:08 గంటలకు చేరుకుంటాయి.
కాజీపేట నుంచి..
రైలు నంబర్.. 07223 కాజీపేట జంక్షన్ నుంచి ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 28 వరకు వారంలో మూడు రోజులు(మొత్తం 15 ట్రిప్పులు) నడుస్తాయి. జనవరి 30వ తేదీ, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీలలో సాయంత్రం కాజీపేట జంక్షన్ నుంచి 06:20 నిమిషాలకు బయలుదేరుతుంది. పెద్దపల్లి జంక్షన్‌కు 7:38 గంటలకు, రామగుండం నుంచి 8:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు(ఒక రోజు ప్రయాణం తర్వాత) ఉదయం 3:35 గంటలకు అయోధ్య ధాం జంక్షన్‌కు చేరుకుంటుంది.
ఇదే రైలు తిరుగు ప్రయాణంలో నంబర్.. 07224 ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2వ తేదీన మొత్తం(15 ట్రిప్పులు) ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైలు అయోధ్య ధాం జంక్షన్ నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్లు అయోధ్య ధాం జంక్షన్ నుంచి వచ్చేటప్పుడు రామగుండంకు సాయంత్రం 6:30 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కు 7 గంటలకు చేరుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment