గ్వాలియర్: అందరినీ గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ అంతం త్వరలోనే ప్రారంభం కానుందట. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి పునాది వేసిన క్షణం నుంచి ఆ మహమ్మారి వినాశనం ఆరంభం అవుతుందంటున్నారు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్, బీజేపీ నేత రామేశ్వర్ శర్మ. బుధవారం గ్వాలియర్‌లో ఆయన మాట్లాడుతూ.. "ఆనాడు మానజాతి సంక్షేమం కోసమే రాక్షసులను చంపేందుకు శ్రీరాముడు పునర్జన్మ ఎత్తాడు. చదవండి: భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక
నేడు రామాలయ నిర్మాణం ప్రారంభమైన వెంటనే కరోనా నాశనం కూడా ఆరంభమవుతుంది. ప్రస్తుతం ప్రపంచమే కరోనాతో కలవరపడుతోంది. కానీ భారత్‌లో మేము కేవలం సామాజిక దూరం పాటించడమే కాదు, మా ఆరాధ్య దైవాలను స్మరించుకుంటూ ఉంటాము" అని చెప్పుకొచ్చారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భౌతిక దూరం పాటిస్తూ సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. (మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణం)
Comments
Please login to add a commentAdd a comment